2019లో 230 స్టాక్స్ పుంజుకోవచ్చంటున్న ఎనలిస్టులు..!

2019లో 230 స్టాక్స్ పుంజుకోవచ్చంటున్న ఎనలిస్టులు..!

BSE సెన్సెక్స్ 2018 నాటికి దాదాపు 6శాతం వృద్ధిని సాధించింది. 2008 ఆర్ధిక సంక్షోభం నాటితో పోలిస్తే.. గ్లోబల్ మార్కెట్లలో డౌజోన్స్ అస్థిరతను తట్టుకుని మరీ BSE సూచీలు నిలదొక్కుకున్నాయి. ఇదే సమయంలో నిఫ్టీలోని స్మాల్ , మిడ్ క్యాప్ సూచీలు 15-30శాతం నష్టపోయాయి. నిఫ్టీ రియాల్టీ రంగం పూర్తిగా కుదేలైంది. కానీ IT పరిశ్రమ మాత్రం కాస్త మెరుగైన ప్రదర్శన చేసింది. 2018లో ఐటీ సెక్టార్ దాదాపు 20శాతం వృద్ధిని నమోదు చేసింది. 
2019 సంవత్సరం ఎలా ఉండబోతుంది.స్టాక్ మార్కెట్లలో మదుపర్లకు లాభాలు తీసుకువచ్చే స్టాక్స్ ఏవి? ఈ ప్రశ్నలకు సమాధానంగా దేశీయ స్టాక్ మార్కెట్లలోని 273 స్టాక్స్‌ను పది మంది ఎనలిస్టులు విశ్లేషించారు . ఈ స్టాక్స్ లో 86శాతం స్టాక్స్ (230 స్టాక్స్ ) మార్కెట్ ధరలు పెరుగుతాయని, మదుపర్లకు లాభాలు తీసుకురావొచ్చని భావించారు. మరో 14 శాతం స్టాక్స్ మాత్రం టార్గెట్ ప్రైస్‌లను చేరుకోకపోవచ్చని.. ప్రతికూల రిటర్న్స్ ను ఇస్తాయని పేర్కొన్నారు.
ఎనలిస్టుల అంచనాల మేరకు  దిలీప్ బిల్డ్ కాన్ 2019లో టార్గెట్ ప్రైస్ రూ. 734 గా, సక్సెస్ రేషియో  75శాతంగా పేర్కొన్నారు. సింప్లెక్స్ ఇన్ఫ్రా టార్గెట్ ప్రైస్‌ రూ. 338గా, సక్సెస్ రేషియో 72శాతం గా పేర్కొన్నారు. ఇవే కాకుండా జిందాల్ స్టీల్, NCC, అతుల్ ఆటో వంటి కంపెనీల సక్సెస్ రేషియో 63-30శాతం ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. 

Stocks snip 2

courtesy by : economicstimes 
ఇక బ్యాంక్ ఆఫ్‌ ఇండియా టార్గెట్ ప్రైస్ రూ. 75 గా, రిటర్న్స్ రేషియో -27శాతంగా ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.  GE T&D ఇండియా, అవెన్యూ సూపర్ మార్ట్స్ , ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ , గ్లాక్సో ఫార్మా వంటివి 2019లో ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని వాటి సక్సెస్ రేషియో -24 శాతం నుండి -18శాతం వరకూ ఉండోచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. 
15-31శాతం మధ్య లాభాలను తీసుకువచ్చే స్టాక్స్ గా బై రేటింగ్స్ ఇచ్చిన వాటిలో దాల్మియాభారత్, అశోకా బిల్డ్ కాన్, SBI లైఫ్ , అహ్లువాలియా కాంట్రాక్ట్స్ , నాట్‌కో ఫార్మా వంటివి ఉన్నాయి. 
స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాలు 2019 చివరి నాటికి పుంజుకోవచ్చని, దేశీయంగా 2019లో సార్వత్రిక ఎన్నికలు ఉండటం, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైతే.. మార్కెట్లు వేగంగా పుంజుకోవచ్చని ఎనలిస్టులు అభిప్రాయ పడుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు దిగిరావడం, రూపీ మారకపు విలువ వంటివి స్టాక్ మార్కెట్లను ఆరంభంలో ప్రభావం చూపుతాయని వారు విశ్లేషిస్తున్నారు. 


 Most Popular