పిఎఫ్ ఖాతాతో సొంతింటి కల నిజమయ్యేనా ?

పిఎఫ్ ఖాతాతో సొంతింటి కల నిజమయ్యేనా ?

పిఎఫ్ అక్కౌంట్ హోల్డర్లకి గుడ్ న్యూస్.ఈపీఎఫ్ ఓలో ఖాతా ఉంటే చాలు..సొంతింటి కల నిజమయ్యే అవకాశం కన్పిస్తోంది..ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు ఇచ్చే వడ్డీ ఎంతైనా సొమ్ము భద్రతకి ఢోకా ఉండదు..అందుకే ప్రభుత్వ రంగంతో పాటు..ప్రవేట్ రంగంలోనూ ఈపీఎఫ్ ఓలో ఖాతాల సంఖ్య నాలుగు కోట్ల మందికి చేరింది.. ఇప్పుడు ఈ ఖాతాతోనే వారంతా గృహరుణం పొందే అవకాశం సంస్థ త్వరలో కల్పించబోతోంది...ఇది నిజంగా గుడ్ న్యూసే ...పైగా ఈ ఖాతా ఆధారంగానే ఈఎంఐలు కట్టుకునే సదుపాయం కూడా కల్పించే ప్రతిపాదన ఉంది.


కార్మిక సంక్షేమశాఖ సెక్రటరీ శంకర్ అగర్వాల్ ఇదే విషయంపై మాట్లాడుతూ ..కాస్త తక్కువ ధరలో ఉన్న ఇళ్ల కొనుగోలుకు ఈపీఎఫ్ఓ మెంబర్లకు అవకాశం కల్పించడంపై ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు..వచ్చే నెలలో జరిగే సంస్థ సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ మీటింగ్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తుంది..ఇందుకు సంబంధించిన అర్హతలు..విధి విధానాలు కూడా ఆ తర్వాతే రూపొందుతాయని తెలుస్తోంది..ఈ ప్రతిపాదన అల్పాదాయ ఉద్యోగులకోసం రూపొందిస్తున్నట్లు శంకర్ చెప్పారు


మామూలుగా ఇలాంటి ఆదాయంతో వారికి లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావు..అలాంటి చిన్న ఉద్యోగులకు ఇదో వరంగానే చెప్పాలి.. ఈ ప్రతిపాదన పట్టాలెక్కితే..ఉద్యోగి,బ్యాంకు..హౌసింగ్ ఏజెన్సీ మూడు పార్టీల మధ్య అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు..ఆదేంటంటే..ఒప్పందం కుదిరిన నెల నుంచి పీఎఫ్ అక్కౌంట్లో జమ అయ్యే డబ్బును ఇంటి రుణం తాలుకూ ఈఎంఐగా బ్యాంకులు స్వీకరిస్తాయ్.. గత ఏడాది సెప్టెంబర్ 16న సిబీటి మీటింగ్  ఎజెండాలో చేర్చారు..అప్పుడే సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ ఫర్ ఈపీఎఫ్ఓ ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనకి అంగీకరించింది.. కేంద్ర పట్టణ పేదరిక నిర్మూలనశాఖ, గృహనిర్మాణశాఖ కేటాయించే ఇళ్లకు కూడా ఈ స్కీమ్ వర్తింపజేయవచ్చని సూచించింది.. ఈ ఏడాది మే నెలలో కార్మికశాఖామంత్రి బండారు దత్తాత్రేయ లోక్ సభకి ఈ ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు..ఇప్పుడు సెప్టెంబర్ లో జరిగే పిఎఫ్ సంస్థ కేంద్రకమిటీ ట్రస్టీ మీటింగ్ లో ఉద్యోగులకి తీపి కబురు విన్పించే అవకాశం ఉంది..
 Most Popular