భారీ ట్రేడింగ్‌- షేర్లు హైజంప్‌

భారీ ట్రేడింగ్‌- షేర్లు హైజంప్‌

నష్టాల బాటలో కదులుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో కొన్ని కౌంటర్లు అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లను భారీగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ కౌంటర్లలో ట్రేడింగ్‌ జోరుగా సాగుతోంది. వెరసి రూపా, ప్రెస్టేజ్‌, హెచ్‌సీసీ కౌంటర్లు లాభపడితే.. ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తొలుత 52 వారాల గరిష్టాన్ని తాకి తదుపరి నష్టాలవైపు చూస్తోంది. వివరాలు చూద్దాం.. 

రూపా అండ్ కంపెనీ: కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన రూపా అండ్‌ కంపెనీ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో రూ. 364 వరకూ ఎగసింది. క్రితం ముగింపు రూ. 330తో పోలిస్తే ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 350 వద్ద ట్రేడవుతోంది. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ఇప్పటివరకూ ఈ కౌంటర్లో ఏకంగా 16 రెట్లు అధికంగా ట్రేడింగ్‌ పరిమాణం నమోదైంది.

ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌: బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన రియల్టీ సంస్థ ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ కౌంటర్‌లో లావాదేవీలు ఊపందుకున్నాయి. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ఇప్పటివరకూ 9 రెట్లు అధికంగా ట్రేడింగ్‌ పరిమాణం నమోదైంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 231 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 232-220 మధ్య ఊగిసలాడింది.

ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌: చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కౌంటర్లో ట్రేడింగ్‌ జోరందుకుంది. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ఇప్పటివరకూ 17 రెట్లు అధికంగా షేర్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.2 శాతం క్షీణించి రూ. 349 దిగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 363 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడం విశేషం!

హెచ్‌సీసీ లిమిటెడ్‌: ముంబై కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన హెచ్‌సీసీ లిమిటెడ్‌ కౌంటర్‌లో లావాదేవీలు పెరిగాయి. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ఇప్పటివరకూ 9 రెట్లు అధికంగా ట్రేడింగ్‌ పరిమాణం నమోదైంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 5 శాతం పురోగమించి రూ. 13.70 వద్ద ట్రేడవుతోంది.  Most Popular