2019లో డబుల్ డిజిట్ ప్రాఫిట్ల కోసం వీటిని పరిశీలించండి.. !

2019లో డబుల్ డిజిట్ ప్రాఫిట్ల కోసం వీటిని పరిశీలించండి.. !

2018 సంవత్సరంలో పలు అస్థిరతలు చోటు చేసుకున్నా.. బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టులు మాత్రం ఒక ఉత్తేజకర సంవత్సరంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే.. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం తక్కువ విలువతో స్టాక్స్‌ను ఎంచుకోడానికి ఈ సంవత్సరం ఉపయోగపడిందని వారు పేర్కొంటున్నారు. BSE సెన్సెక్స్ ఈ సంవత్సరం మొత్తం మీద 6 శాతం పెరిగింది. అలాగే నిఫ్టీ కూడా మొత్తం మీద 3 శాతం గరిష్టానికి చేరింది. అయినప్పటికీ.. విస్తృత మార్కెట్లు మందంజ వేయలేక పోయాయి.  నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు 16 శాతం నష్టపోయాయి. ఇక నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 30శాతం నష్టపోయింది ఇదే సమయంలో. 2018 మధ్యలో మార్కెట్లలో తిరోగమన వీచికలు సంభవించినప్పటికీ,, సంవత్సరం ఎండింగ్‌లో ఇవి సానుకూల పవనాలుగా మారిపోయాయి. క్రూడ్ ఆయిల్ ధరలు దిగిరావడం, రూపీ డాలర్‌లో కాస్త బలపడటం వంటి అంశాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. కానీ.. 2019లో సార్వత్రిక ఎన్నికలు రానుండటంతో మార్కెట్లు డోలాయానంలో ఊగిసలాడవచ్చు. సుస్థిర ప్రభుత్వం ఏర్పడితేనే.. మార్కెట్లు మళ్ళీ వేగంగా పుంజుకుంటాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. అయితే.. చాలా మంది ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు, ఫండ్ మేనేజర్లు రానున్న 2019లో పలు స్టాక్స్ డబుల్ డిజిట్ ప్రాఫిట్లను సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. రానున్న సంవత్సరంలో మార్కెట్లు భారీగా పెరగడానికి పలు అంశాలు దోహద పడుతున్నాయని వారి అభిప్రాయం. దేశంలో పెరిగిన పన్నుల రాబడి, సాపేక్షంగా స్థిరంగా కరెన్సీ మారకం, దేశీయ ఆదాయంలో పాక్షిక రికవరీలు, వంటివి మార్కెట్లకు ఆరోగ్యకరమైన సంకేతాలను ఇస్తున్నాయి.  సార్వత్రిక ఎన్నికల తరువాత సెన్సెక్స్.. 40,000-45,000 పాయింట్లకు చేరుకోవచ్చని ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎంజిల్ బ్రోకింగ్ భావిస్తుంది. కానీ ఎన్నికలకు ముందు మాత్రం మదుపర్లు వేచి చూసే ధోరణినే పాటించాలని ఎంజిల్ సంస్థ సూచిస్తుంది. 
ఏంజిల్ , కార్వే, మోతీలాల్ ఓశ్వాల్ వంటి బ్రోకరేజ్ కంపెనీల అంచనాల మేరకు ఈ కింది స్టాక్స్ 2019లో 10-85 శాతం ప్రాఫిట్స్‌ను అందించనున్నాయని అంచనా వేస్తున్నాయి. అవేంటో చూద్దాం.

ICICI బ్యాంక్ : బై రేటింగ్స్: ; ప్రస్తుత ధర రూ.361: టార్గెట్ ప్రైస్ రూ. 440: రిటర్న్స్ 21%
అశోక్ లేల్యాండ్ : Buy | LTP: Rs 102| Target: Rs 150| Return 47%
సన్ టెక్ రియాల్టీ : Buy | LTP: Rs 347| Target: Rs 497| Return 43%
మేనన్ బేరింగ్స్: Buy | LTP: Rs 77.45|Target: Rs 120| Return 55%
రిలాక్సో ఫుట్‌వేర్ : Buy | LTP: Rs 730| Target: Rs 911| Return 24%
KNR కన్‌స్ట్రక్షన్స్ : Buy | Target: Rs 260| LTP: Rs 212| Upside: 22%
ఆర్తి ఇండస్ట్రీస్ : Buy | LTP: Rs 1,423| Target: Rs 1,750| Upside 22%
బ్రిటానియా ఇండస్ట్రీస్ : Buy | LTP: Rs 3,098| Target: Rs 3780| Upside 22%
ఏషియన్ పేయింట్స్:  Buy | LTP: Rs 1,365| Target: Rs 1,750| Return 28%
రిలయన్స్ ఇండస్ట్రీస్ : Buy | LTP: Rs 1,125| Target: Rs 1,500| Return 33%
UPL : Buy | LTP: Rs 757| Target: Rs 940| Return 24%
JK లక్ష్మీ సిమెంట్స్ : Buy | LTP: Rs 288| Target: Rs 480| Return 66%
BSE: Buy | LTP: Rs 588| Target: Rs 1080| Return 83%
టైటాన్ కంపెనీ లిమిటెడ్ : Buy | LTP: Rs 922| Target: Rs 1105| Return 20%
ఇండియా హోటెల్స్ లిమిటెడ్ : Buy | LTP: Rs 148| Target: Rs 163| Return 10%
మారికో లిమిటెడ్ : Buy | LTP: Rs 378| Target: Rs 465| Return 23%
ఒబెరాయ్‌ రియాల్టీ : Buy | LTP: Rs 453| Target: Rs 574| Return 26%
అరబిందో ఫార్మా : Buy | LTP: Rs 723| Target: Rs 920| Return 27%
హిందూస్థాన్ యూనీలివర్ : buy | LTP: Rs 1820| Target: Rs 2140| Return 18%

 

Disclaimer :  పైన ఉదహరించబడిన సూచనలు, సలహాలు ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టులచే ఇవ్వబడినవి. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.
 Most Popular