ఎన్నికలకు ముందు ఈ రంగాలు ఎంచుకుంటే మంచి లాభాలు..!!

ఎన్నికలకు ముందు ఈ రంగాలు ఎంచుకుంటే మంచి లాభాలు..!!

2018 మదుపర్లకు కొద్ది లాభాలనే పంచి , ఎక్కువగా నష్టాలనే మిగిల్చింది. మరి రానున్న సంవత్సరం వేసవిలో సార్వత్రిక ఎన్నికలున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాతే.. మార్కెట్లలో సుస్థిరత ఏర్పడబోతుందన్నది విశ్లేషకుల భావన. మరి 2019 సంవత్సరారంభంలో ఎలాంటి స్టాక్స్ పిక్ చేసుకోవాలి, వేటి మీద పెట్టుబడులను పెట్టాలన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దేశీయ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ పరిమాణాలతో ప్రభావితం అవుతున్నాయి. అమెరికన్ షట్ డౌన్ కూడా మార్కెట్లను నెమ్మదించేలా చేసింది. క్రూడ్ ఆయిల్ ధరలు ఈ సంవత్సరం నాటికి దిగి వచ్చినా.. రానున్న కాలంలో ఎలా ఉండబోతాయో అన్నది మదుపర్ల ఆలోచన. 
మార్కెట్లను ప్రభావితం చేయనున్న ఎన్నికల హామీలు
ప్రభుత్వం యొక్క జనాకర్షక చర్యలు పెరుగుతున్నాయి మరియు ఇప్పటికీ ఆరంభ దశలో ఉన్నాయి. అయితే..ఈ చర్యల వల్ల ప్రజలు మెరుగ్గా ఉండటం అటుంచితే.. దేశ ఆర్ధిక వ్యవస్థ కుంటుపడుతుంది. కార్పోరేట్ ఆదాయాలు తగ్గిపోతాయి. ఈ కామర్స్ దిగ్గజాలైన  అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలకోసం పారిశ్రామిక విధానం మారిస్తే.. అది సాంప్రదాయిక వ్యాపారాలను కూకటి వేళ్లతో సహా పెకిలించినట్టే... అవుతొంది. చిన్న , మధ్య స్థాయి పరిశ్రమలకు, వ్యాపారాలకు ప్రభుత్వం చేయూతనిస్తే రానున్న సంవత్సరంలో మార్కెట్లు కళకళలాడుతాయి. ఎన్నికల వేళ రాజకీయ నేతల వాగ్దానాలు కూడా నేల విడిచి సాము చేస్తాయి. హెల్త్ కేర్, వ్యవసాయం, రుణ రంగంలో ఈ వాగ్దానాల అమలు మార్కెట్లను, బ్యాంకులను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఎన్నికలకు ముందే సరైన స్టాక్స్ ఎంపిక చేసుకోమని ఎనలిస్టులు సూచిస్తున్నారు. 
ఎన్నికలకు ముందు ఏ స్టాక్స్ ఎంచుకోవాలి:
ఎన్నికలకు ముందు ప్రభుత్వం అంతకు ముందు ప్రకటించిన ప్రాజెక్టులను కంప్లీట్ చేయడానికే యత్నిస్తుంది. దాంతో ఇన్ఫ్రా, రోడ్లు, నిర్మాణ రంగం, సిమెంట్ కంపెనీస్ వంటి స్టాక్స్ ఆకర్షణీయంగా మారుతాయి.  ఈ రంగాల్లోని స్టాక్స్ ఎన్నికలకు ముందు , తరువాత కూడా లాభాలను తీసుకురావొచ్చని ఎనలిస్టులు పేర్కొంటున్నారు.  ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే.. పలు ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు వంటి వాటిని పూర్తి చేయడానికే ప్రభుత్వాలు యత్నిస్తాయి కాబట్టి.. సిమెంట్, మెటల్ రంగాలు పుంజుకోవచ్చు.  ఇప్పటికే దేశంలో ఈ ప్రాజెక్టుల విలువ రూ. 1 లక్ష కోట్లుగా ఉంది.  ఈ నిధులను రాబోయే 2-3 వారాల్లో కాంట్రాక్టు కంపెనీలకు విడుదల చేయనున్నారు. దాంతో పనులు కూడా వేగిరం అవుతాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. నిర్మాణ రంగంలోని కంపెనీలైన KNR కన్‌స్ట్రక్షన్, దిలిప్ బిల్డ్ కాన్,  PNCఇన్ఫ్రా, NBCC వంటి స్టాక్స్ ఎలక్షన్లకు ముందు మంచి లాభాలను ఇవ్వొచ్చని ఎనలిస్టుల అంచనా. 

 Most Popular