ఈ వారం మార్కెట్ల రూటెటు?!

ఈ వారం మార్కెట్ల రూటెటు?!

అటు అమెరికా, ఇటు దేశీ స్టాక్‌ మార్కెట్లు గత వారం భారీ పతనాల నుంచి బయటపడి ఒక్కసారిగా జోరందుకున్నాయి. వీటితోపాటు గత వారం పలు యూరోపియన్‌, ఆసియా మార్కెట్లు సైతం నికరంగా లాభాలు ఆర్జించాయి. యూఎస్‌ మార్కెట్లయితే 3-4 శాతం మధ్య జంప్‌చేశాయి. ఈ బాటలో దేశీ ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ సైతం లాభాల దౌడు తీసింది. మరోసారి 36,000 పాయింట్ల మైలురాయిని దాటి ముగిసింది. దీంతో ఇకపై మార్కెట్లలో కొంతమేర కన్సాలిడేషన్‌ కనిపించవచ్చని సాంకేతిక విశ్లేషకులు భావిస్తున్నారు. 

నిఫ్టీకి 10,985 కీలకం
గత వారం దాదాపు 1 శాతం పుంజుకున్న ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ డైలీ చార్టుల ప్రకారం బుల్లిష్‌ కేండిల్‌ను సృష్టించగా... వీక్లీ చార్టుల ప్రకారం హ్యామర్ ప్యాటర్న్‌లో ముగిసినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. గత వారం చివరి మూడు రోజుల్లో ఊపందుకున్న నిఫ్టీ 11,000 పాయింట్లవైపు కదలవచ్చని.. దీంతో 10,985 స్థాయి కీలకంగా నిలవనుందని అంచనా వేశారు. అయితే గత వారం 10,860 వద్ద నిలిచిన నిఫ్టీ తొలుత కొంతమేర హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 10750-10777 స్థాయిలకు ఎగువన నిలిస్తే 11,000 వైపు కదలవచ్చని.. ఒకవేళ బలహీనపడితే.. 10777 స్థాయిలో మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు. బలాన్ని పుంజుకుంటే.. 10940-10980 వద్ద రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని అంచనా వేశారు. 

Image result for parliament

ఇతర కీలక అంశాలు
ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, ఆర్థిక గణాంకాలు వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నట్లు తెలియజేశాయి. వీటికితోడు ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల తీరు వంటి అంశాలు దేశీయంగా స్టాక్‌ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. జనవరి 8 వరకూ కొనసాగనున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలపైనా ఇన్వెస్టర్లు కన్నేయనున్నట్లు తెలియజేశారు. డిసెంబర్‌ నెలకు వాహన విక్రయ గణాంకాలు వెలువడనున్న కారణంగా ఆటో రంగ కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడయ్యే అవకాశముంది.Most Popular