2018లో కకావికలమైన స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాలు..!!

2018లో కకావికలమైన స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాలు..!!

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ 2018 సంవత్సరంలో ఉథ్థాన పతనాలను చవి చూశాయి. మార్కెట్లలోని దాదాపు 2,371 స్టాక్స్‌లో 2,011 స్టాక్స్ మదపర్లకు నష్టాలనే మిగిల్చాయి. ఇది మొత్తం స్టాక్స్‌లో 85శాతంగా ఉండటం గమనార్హం. ఈ క్యాలెండర్ ఇయర్‌ లో మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ రంగాల్లోని డజన్ల కొద్ది స్టాక్స్ 90శాతం వరకూ పడిపోయాయి. ఈ సంవత్సరం IL&FS సంక్షోభం, రూపీ పతనం, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, గ్లోబల్ మార్కెట్ల పరిణామాలు వంటివి దేశీయ మార్కెట్లను కకావికలం చేశాయి. సంవత్సరం మధ్యలో కొంత మెరుగైన స్థితి కనబడ్డా.. ఆ తరువాత పతనం బాటలోనే మార్కెట్లు నడిచాయి. బడా ఇన్వెస్టర్లు, బిగ్ బుల్స్ పోర్ట్ ఫోలియోలను  ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ నష్టాల పాలు చేశాయి.
మదుపర్లను ముంచేసిన నీరవ్‌మోడీ గీతాంజలీ జెమ్స్ స్టాక్స్ 
2018లో అత్యంత పేలవమైన , ఘోరమైన ప్రదర్శన చేసిన స్టాక్, నీరవ్‌ మోడీకి చెందిన గీతాంజలీ జెమ్స్ మాత్రమే. అత్యంత ఎక్కువ శాతం పతనమైన స్టాక్‌గా ఈ గీతాంజలీ జెమ్స్ షేర్ రికార్డ్‌ను నెలకొల్పింది. జనవరి 1, 2018 న ఈ స్టాక్ వాల్యూ రూ. 71.05 గా ఉంది. ఈ డిసెంబర్ 27 నాటికి గీతాంజలి జెమ్స్ రూ. 0.99 గా ట్రేడ్ అయింది. అంటే దాదాపు 98.55శాతం నష్టపోయిన ఏకైక స్టాక్ గీతాంజలీ జెమ్స్ మాత్రమే. ఆర్ధిక రుణాల ఎగవేత దారుడిగా ముద్ర పడ్డ నీరవ్‌ మోడీ పరారీ, కోర్టు కేసుల విచారణ నేపథ్యంలో సెబీ ఈ స్టాక్‌ను బ్లాక్ చేసినట్టు సమాచారం.

Image result for nirav modi gitanjali gems
దీనితో బాటు ఇతర షేర్లైన సన్‌ స్టార్ రియాలిటీ, కృష్ణా వెంచర్స్, యామిని ఇన్వెస్ట్‌మెంట్స్ , క్రిసెంట్ లీజింగ్ ఫిన్ వంటి కంపెనీలు 95శాతం నష్టపోయాయి. ఇవే కాకుండా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఫైనాన్స్, NBFC కంపెనీల స్టాక్స్ కూడా అత్యధికంగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. దేశీయ మార్కెట్లోని దాదాపు 90 స్టాక్స్ 85-90 శాతం నష్టపోయాయి. వీటిలో క్వాలిటీ, ఆశాపుర ఇంటిమేట్ ఫ్యాషన్స్, బోంబే రేయాన్, వక్రంజీ, GTL ఇన్ఫ్రా, ఆమ్‌టెక్ ఆటో, రోల్టా ఇండియా, పూంజ్ లాయిడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, 8K మైల్స్, అట్లాంటా గామన్ ఇన్‌ఫ్రా వంటి స్టాక్స్ 85-90శాతం మధ్యలో నష్టపోయాయి. 
2018 ఆగస్ట్ మాత్రమే బెటర్‌...
ఇదే సంవత్సరం ఆగస్ట్‌ 29 న సెన్సెక్స్ ఆల్‌టైం గరిష్టంగా 38,989 పాయింట్లకు చేరింది. ఆ తరువాత అక్టోబర్ 26 నాటికి లోయెస్ట్ స్టేజ్‌లో 33,349 పాయింట్లకు చేరింది. ఇదే ఆగస్ట్‌ చివరి నాటికి నిఫ్టీ 50 11,750 పాయింట్లను తాకింది. కానీ అక్టోబర్ నాటికి 10,030 స్థాయికి పడిపోయింది. మొత్తం మీద స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ సూచీలు 15-25 శాతం నష్టపోయాయి. BSE లో లిస్ట్ అయిన కంపెనీస్ మార్కెట్ వాల్యూ  ఈ డిసెంబర్ నాటికి రూ. 143 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇదే 2017 డిసెంబర్ నాటికి వాటి వాల్యూ రూ. 151 లక్షల కోట్లుగా ఉండేది. అంటే.. సుమారు రూ. 8 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. 
ఇక ఎస్ బ్యాంక్ , దివాన్ హౌజింగ్, PC జ్యూయల్‌రీస్, జెట్ ఎయిర్ వేస్, ఇన్ఫీబీమ్ అవెన్యూస్, రిలయన్స్ క్యాపిటల్ , జూబిలెంట్ ఇండస్ట్రీస్, బోంబే డైయింగ్, టాటా మోటార్స్, దులీప్ బిల్డ్ కాన్, అవంతీ ఫీడ్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి స్టాక్స్ తమ మార్కెట్ వాల్యూలో 50శాతం వరకూ నష్టపోయాయి. BSE లో లిస్ట్‌ అయిన 4700 కు పైబడి ఉన్న కంపెనీల్లో కేవలం 360 స్టాక్స్ మాత్రమే మదుపర్లకు లాభాలను మిగిల్చాయి.  వాటిలో సాధాన నైట్రో కెమ్, దోలత్ ఇన్వెస్ట్‌మెంట్స్,  డార్జిలింగ్ రోప్‌వే కంపెనీ, ఓరియంట్ ట్రేడ్ లింక్, వికాస్ ప్రొపోనెంట్ &గ్రానైట్, థింక్ ఇంక్ స్టూడియోస్ వంటి స్టాక్స్ దాదాపు 900శాతం పెరిగి మదుపర్లకు లాభాలను చవిచూపాయి. 
 Most Popular