పెనిన్సులా- 5పైసాకు కొనుగోళ్ల కిక్‌

పెనిన్సులా- 5పైసాకు కొనుగోళ్ల కిక్‌

రాక్‌ఫస్ట్‌ రియల్‌ఎస్టేట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పెనిన్సులా ల్యాండ్‌ తాజాగా వెల్లడించింది. దీంతో  ఉన్నట్టుండి ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోపక్క ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న 5పైసా కేపిటల్‌ కౌంటర్‌ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

పెనిన్సులా లాండ్‌
రాక్‌ఫస్ట్‌ రియల్‌ఎస్టేట్‌లో 86 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పెనిన్సులా ల్యాండ్‌ తాజాగా తెలియజేసింది. డీల్‌ పూర్తి వివరాలు తెలియనప్పటికీ.. దీంతో పెనిన్సులాకు సొంత అనుబంధ సంస్థగా రాక్‌ఫస్ట్‌ మారనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు గుడ్‌హోమ్‌ రియల్టీ, ట్రూవిన్‌ రియల్టీలలోనూ వాటాల కొనుగోలుకి పెనిన్సులా లాండ్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. వెరసి ఈ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 11.70 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 12 వరకూ ఎగసింది.

Image result for 5paisa capital

5పైసా కేపిటల్‌
ప్రమోటర్లు వాటాను పెంచుకున్న వార్తలతో 5పైసా కేపిటల్‌ కౌంటర్‌కు వరుసగా రెండో రోజు డిమాండ్‌ పెరిగింది. అంతా కొనేవాళ్లే తప్ప అమ్మేవాళ్లు కరవుకావడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 223 వద్ద ఫ్రీజయ్యింది. గురువారం సైతం ఈ షేరు 7 శాతం జంప్‌చేసింది. కంపెనీ ప్రమోటర్ నిర్మల్‌ భన్వర్‌లాల్‌ జైన్‌ ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా 50,000 ఈక్విటీ షేర్లను అదనంగా కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఇన్వెస్టర్లు 5పైసా కౌంటర్లో కొనుగోళ్లకు క్యూకట్టినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 30.4 శాతానికి చేరింది. కాగా.. షేరుకి రూ. 190 ధరలో సత్పాల్‌ ఖట్టర్‌ 5 పైసాకు చెందిన 1.94 శాతం వాటాను విక్రయించారు. Most Popular