మళ్లీ ఫ్యూచర్‌ రిటైల్‌ నేలచూపు

మళ్లీ ఫ్యూచర్‌ రిటైల్‌ నేలచూపు

గత రెండు రోజులుగా నేలచూపులతో కదులుతున్న ఫ్యూచర్‌ రిటైల్‌ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలకే మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 3 శాతం క్షీణించి రూ. 499 వద్ద ట్రేడవుతోంది. గత ముగింపు రూ. 513 కాగా.. ఇంట్రాడేలో రూ. 515 వద్ద గరిష్టాన్నీ, రూ. 484 దిగువన కనిష్టాన్నీ తాకింది. దీంతో మూడు రోజుల్లో 14 శాతంవరకూ నష్టపోయినట్లయ్యింది.

అమ్మకాల ఒత్తిడిలో
ఫ్యూచర్‌ గ్రూప్‌లోని ప్రధాన సంస్థ ఫ్యూచర్ రిటైల్ గత రెండు రోజులుగా బలహీనంగా కదులుతోంది. నిజానికి మార్కెట్లు నష్టాలను వీడి లాభాల్లోకి మళ్లినప్పటికీ ఈ షేరు డీలాపడుతోంది. వెరసి గత రెండు రోజుల్లో 8 శాతం తిరోగమించింది. ఈకామర్స్‌ కంపెనీలపై తాజాగా కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలకు తెరతీసిన నేపథ్యంలో ఈ కౌంటర్‌లో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. విభిన్న ఫార్మాట్లలో డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌ ద్వారా ఫ్యూచర్‌ రిటైల్‌.. హౌస్‌హోల్డ్‌, కన్జూమర్‌ ప్రొడక్టులను విక్రయించే విషయం విదితమే. 

Related image

నిబంధనల ఎఫెక్ట్‌
ఈ కామర్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై బుధవారం పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక మండలి(డీఐపీపీ) అదనపు మార్గదర్శకాలను జారీ చేసింది. అంతేకాకుండా ఈకామర్స్‌ కంపెనీలు ప్రత్యేక డిస్కౌంట్ల కోసం వెండార్స్‌ను పట్టుపట్టే విధానాలకు చెక్‌ పెట్టింది. ప్రొడక్టులు విక్రయించే కంపెనీల వద్ద గల నిల్వల నుంచి ఈకామర్స్‌ కంపెనీలు 25 శాతానికిమించి కొనేందుకు వీలులేకుండా నిబంధనలు తీసుకువచ్చింది. ఆఫ్‌లైన్‌ రిటైలర్లు, ఇతర దుకాణదారులకు డిస్కౌంట్‌ సేల్స్‌ నుంచి కొంతమేర రక్షణ కల్పించేందుకు తాజా నిబంధనలు దోహదం చేసే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.Most Popular