కొత్త సిరీస్‌- 8 స్టాక్స్‌లో రోలోవర్లు!

కొత్త సిరీస్‌- 8 స్టాక్స్‌లో రోలోవర్లు!

నిఫ్టీ జనవరి సిరీస్‌కు 74 శాతంపైగా పొజిషన్లలో రోలోవర్స్‌ జరిగాయి. గత మూడు నెలలుగా 70 శాతం సమీపంలోనే రోలోవర్స్‌ నమోదవుతున్నాయి. అయితే బ్యాంకింగ్‌ ఇండెక్స్‌లో ఫ్రెష్ బిల్డప్‌ ఎక్కువగా జరగలేదు. ఇకపై ఊపందుకునే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఫ్రెష్ బిల్డప్‌ ద్వారా మాత్రమే బ్యాంక్‌ నిఫ్టీలో ట్రెండ్‌ రూపుదిద్దుకోనున్నట్లు పేర్కొన్నారు. చెప్పుకోదగ్గ ర్యాలీతో నవంబర్‌ కాంట్రాక్టులు గడువు ముగియగా.. డిసెంబర్‌ ఎక్స్‌పైరీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. డిసెంబర్‌ నెలలో నిఫ్టీ 650 పాయింట్ల పరిధిలో ఊగిసలాడింది. డిసెంబర్‌ సిరీస్‌లో ఏర్పడ్డ కొన్ని మిక్స్‌డ్‌ పొజిషన్లు జవనరికి రోలోవర్‌ అయినట్లు నిపుణులు చెబుతున్నారు. 

Image result for banking

స్టాక్స్‌లో యాక్టివిటీ
పీసీ జ్యువెలర్స్‌, బీఈఎంఎల్‌, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, బాటా ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కావేరీ సీడ్‌ కంపెనీ, కజారియా సిరామిక్స్‌ కౌంటర్లలో లాంగ్‌ పొజిషన్లు భారీ స్థాయిలో రోలోవర్‌ అయినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే మరోవైపు డిసెంబర్‌ సిరీస్‌లో భారీగా షార్ట్స్‌ బిల్డప్‌ జరిగిన సన్‌ ఫార్మా, జెట్‌ ఎయిర్‌వేస్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, భారత్‌ ఫోర్జ్‌, అరబిందో ఫార్మా, ఆయిల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కౌంటర్లలో రోలోవర్‌ అధికంగా నమోదైనట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. గత మూడు నెలలుగా నిఫ్టీని మించి పెర్ఫార్మెన్స్‌ చూపుతున్న బ్యాంక్‌ నిఫ్టీ రానున్న రోజుల్లో అండర్‌ పెర్ఫార్మర్‌గా నిలిచే వీలున్నట్లు కొంతమంది సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇకపై నమోదుకానున్న ఫ్రెష్‌ బిల్డప్‌ బ్యాంక్‌ నిఫ్టీని నడిపించనున్నట్లు తెలియజేశారు. Most Popular