2018లో స్మాల్ క్యాప్ మల్టీ బ్యాగర్స్ కేవలం 5 స్టాక్సే..!

2018లో స్మాల్ క్యాప్ మల్టీ బ్యాగర్స్ కేవలం 5 స్టాక్సే..!

2018లో ఎక్కువగా నిరాశ పరిచింది  స్మాల్ క్యాప్ రంగమే.  రాకేష్ ఝున్ ఝున్ వాలా, డాలీ ఖన్నా వంటి బిగ్ బుల్స్ పోర్ట్ ఫోలియోలను నేల మట్టం చేసింది కూడా ఈ స్మాల్ క్యాప్ స్టాక్సే. 2017లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన స్మాల్ క్యాప్ స్టాక్స్ 2018లో మాత్రం కుదేలయ్యాయి. 2017లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 60శాతం వృద్ధి చెందింది. దాదాపు 167 స్టాక్స్ మల్టీ బ్యాగర్లు గా మారి మదుపర్లకు లాభాలను తీసుకొచ్చాయి. వీటిలో HEG, ఇండియా బుల్స్ వెంచర్స్, గ్రాఫైట్ ఇండియా,  వెంకీస్ ఇండియా, అవంతీ ఫీడ్స్ వంటి స్టాక్స్ ఉన్నాయి.  కానీ 2018 వచ్చేసరికి ఈ స్మాల్ క్యాప్ రంగంలోని స్టాక్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. కేవలం 5 స్టాక్స్ మాత్రమే మల్టీ బ్యాగర్లుగా మారాయి. స్మాల్ క్యాప్ లోని మిగతా అన్ని స్టాక్స్ క్షీణతను ఎదుర్కొన్నాయి. వీటిలో కొన్ని 40-90శాతం నష్టపోయినవి కూడా ఉన్నాయి. 2018లో  స్మాల్ క్యాప్ రంగంలో గత సంవత్సరం లాభాలు తెచ్చిన 167 కంపెనీల్లో 97శాతం కంపెనీల స్టాక్స్ నష్టపోవడం గమనార్హం. మల్టీ బ్యాగర్లుగా  లాభాలను  తీసుకువచ్చిన 5 స్టాక్స్ .. ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ , ఎక్సెల్ ఇండస్ట్రీస్, మెర్క్, IOL కెమికల్స్&ఫార్మా, నెల్కో  స్టాక్స్ మాత్రమే లాభాల బాటలో నడిచాయి. 
 Most Popular