అడాగ్‌ హవా- మహీంద్రా హాలిడేస్‌ జోరు

అడాగ్‌ హవా- మహీంద్రా హాలిడేస్‌ జోరు

ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల దన్నుతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్వెస్టర్లు అనిల్‌ ధీరూభాయి అంబానీ గ్రూప్‌(అడాగ్‌) కౌంటర్లపై కన్నేశారు. దీంతో అడాగ్‌ గ్రూప్‌లోని పలు షేర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తున్నాయి. మరోపక్క సంస్థాగత ఇన్వెస్టర్లతో సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో మహీంద్రా హాలిడేస్‌ కౌంటర్‌ సైతం జోరందుకుంది. వివరాలు చూద్దాం..

జోరుగా 
అడాగ్‌ షేర్లలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్‌ కేపిటల్‌ 6 శాతం జంప్‌చేసి రూ. 227కు చేరగా.. రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 4 శాతం ఎగసి రూ. 315 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో రిలయన్స్‌ పవర్‌ 4.25 శాతం పుంజుకుని రూ. 29.6ను తాకగా,  రిలయన్స్ నిప్పన్‌లైఫ్‌ 3 శాతం లాభపడి రూ. 162కు చేరింది. ఇదే విధంగా రిలయన్స్హోమ్‌ ఫైనాన్స్‌ 2.25 శాతం పెరిగి రూ. 40.7 వద్ద, రిలయన్స్ నావల్‌ 2.2 శాతం బలపడి రూ. 14.15 వద్ద, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ 1.7 శాతం లాభంతో రూ. 14.7 వద్ద ట్రేడవుతున్నాయి.

Related image

మహీంద్రా హాలిడేస్‌
ప్రయివేట్‌ రంగ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌లతో ముంబైలో నేడు సమావేశంకానున్నట్లు మహీంద్రా హాలిడేస్‌ వెల్లడించింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో మహీంద్రా హాలిడేస్‌ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 204 వద్ద ట్రేడవుతోంది.Most Popular