ఈ స్టాక్స్‌ను గమనించండి.. (డిసెంబర్ 28)

ఈ స్టాక్స్‌ను గమనించండి.. (డిసెంబర్ 28)
 • అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌ పింకస్‌తో కలసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేసిన లెమన్‌ ట్రీ హోటల్స్‌
 • అద్దె గృహాల ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన లెమన్‌ ట్రీ హోటల్స్‌
 • ఈ జేవీలో వార్‌బర్గ్‌ పింకస్‌కు 68 శాతం, లెమన్‌ ట్రీ హోటల్స్‌కు 30 శాతం వాటా, పతంజలి కేస్వానికి 2 శాతం వాటా
 • కొత్త జాయింట్‌ వెంచర్‌ సంస్థలో తొలి దశలో రూ.1500 కోట్ల పెట్టుబడులు, మలి దశలో మరో రూ.1500 కోట్ల ఇన్వెస్ట్‌
 • యునైటెడ్‌ బ్యాంక్‌ రూ.2159 కోట్ల మూలధన సాయం అందించనున్న ప్రభుత్వం
 • పెర్మా కన్‌స్ట్రక్షన్స్‌తో వాటా కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న కన్సాయ్‌ నెరోలాక్‌
 • రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.498 కోట్ల నిధులను సమీకరించిన హిందుస్తాన్‌ కన్‌స్ట్రక్షన్‌
 • హిందుస్తాన్‌ కన్‌స్ట్రక్షన్స్‌లో 27.8 శాతం నుంచి 33.12 శాతానికి పెరగనున్న ప్రమోటర్ల వాటా
 • NCDల జారీ ద్వారా రూ.150 కోట్ల నిధులను సేకరించేందుకు అశోకా బిల్డ్‌కాన్‌ బోర్డ్‌ గ్రీన్‌సిగ్నల్‌
 • కార్పొరేషన్‌ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా పీవీ భారతి నియామకం
 • త్రివేణి టర్బైన్‌ షేర్ల బైబ్యాక్‌కు ఇవాళే రికార్డ్‌ డేట్‌
 • 5శాతానికి తగ్గిన రుచి సోయా ఇండస్ట్రీస్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌
 • డయాలసిస్‌ చికిత్సకు వినియోగించే "సెవేలామర్‌ కార్బొనేట్‌" ఔషధాన్ని యూఎస్‌ మార్కెట్లో విక్రయించనున్న డాక్టర్‌ రెడ్డీస్‌
 • దేశీయ మార్కెట్‌ నుంచి తమ నిర్మాణ విభాగానికి రూ.2,357 కోట్ల ఆర్డర్లు వచ్చాయని తెలిపిన L&T
 • సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఉత్పత్తులకు కొత్త పేటెంట్లు
 • నాడీసంబంధిత వ్యాధుల చికిత్సలో వినియోగించే కొత్త ఔషధానికి బ్రెజిల్‌, యూరేషియాల నుంచి కొత్త పేటెంట్లు వచ్చాయన్న సువెన్‌ లైఫ్‌


Most Popular