మ్యూచువల్ ఫండ్స్‌కు , FIIsలకు 2018లో నష్టాలు మిగిల్చిన స్టాక్స్ ఇవే...!

మ్యూచువల్ ఫండ్స్‌కు , FIIsలకు 2018లో నష్టాలు మిగిల్చిన స్టాక్స్ ఇవే...!

2018 దేశీయ మార్కెట్ల ఇన్వెస్టర్లకు కలిసిరాలేదనే చెప్పాలి. రూపీ పతనం, అంతర్జాతీయ పరిణామాలు, IL&Fs సంక్షోభం, లిక్విడిటీ సమస్యలు , క్రూడ్ ఆయిల్ ధరలు వంటి కారణంగా మార్కెట్లు పలు కరెక్షన్లకు లోనయ్యాయి. సురక్షితమని భావించే మ్యూచువల్ ఫండ్స్ కూడా నష్టాలనే చవి చూశాయి. ముఖ్యంగా విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) కూడా నష్టాలనే మూట గట్టుకున్నారు. ప్రధానంగా 2018లో మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు, ఫారిన్ ఇన్వెస్టర్లు 15 స్టాక్స్ మీద పెట్టుబడులను పెట్టారు. అందులో కేవలం 4 స్టాక్స్ మాత్రమే లాభాలను ఆర్జించాయి. మిగతా 11 స్టాక్స్ చేతి చమురును వదిలించాయి. 
మంగళూరు రిఫైనరీ &: 
ఈ స్టాక్ మీద మ్యూచువల్ ఫండ్స్ వారు ప్రతి క్వార్టర్‌లోనూ పెట్టుబడులను ఉంచారు. 2018 మార్చ్ త్రైమాసికంలో -1.60 శాతం , జూన్ క్వార్టర్‌లో -1.70 శాతం , సెప్టెంబర్ త్రైమాసికంలో -1.77 శాతం నష్టాలను మిగిల్చింది. ఇదే స్టాక్ మీద పెట్టుబడులను పెట్టిన FIIs కూడా నష్టపోయారు.  సెప్టెంబర్ క్వార్టర్‌లో -1.62 శాతం, జూన్ క్వార్టర్‌లో -1.56 శాతం, మార్చ్‌ క్వార్టర్‌లో -1.54 శాతం నష్టపోయారు. మొత్తం మీద సంవత్సరం నుండి ఈ రోజు వరకూ (year to date ) YTD లాస్ వచ్చేసి 43.4శాతం  నష్టంగా నమోదైంది. 
JM ఫైనాన్షియల్ : 
MF లు ఈ స్టాక్ మీద పెట్టిన పెట్టుబడులు  సెప్టెంబర్ క్వార్టర్‌లో -4.18 శాతం, జూన్ క్వార్టర్‌లో -3.95 శాతం, మార్చ్‌లో -1.61 శాతం నష్టపోయాయి. ఇక FIIలు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌లో సెప్టెంబర్ క్వార్టర్‌లో -6.53శాతం, జూన్ త్రైమాసికంలో -6.27 శాతం, మార్చ్‌లో 2.65శాతం నష్టపోయారు. వార్షిక నష్టం  (YTD LOSS) వచ్చేసి 43.1శాతంగా ఉంది. 

సుందరం క్లేటన్ :
MFల పెట్టుబడులు ఈ స్టాక్ మీద సెప్టెంబర్ క్వార్టర్‌లో 12.66శాతం, జూన్ లో -12.63శాతం, మార్చ్‌ క్వార్టర్‌లో -12.52శాతం నష్టపోయాయి. FIIల పెట్టుబడులు కూడా సెప్టెంబర్ క్వార్టర్‌లో 0.61 శాతం, జూన్ లో -0.57శాతం, మార్చ్‌లో -0.48శాతం నష్టపోయాయి. వార్షిక లాస్ (YTD) 36.09శాతంగా నమోదైంది. 
మిండా కార్పోరేషన్ ; 
MF ల పెట్టుబడులు ఈ స్టాక్ మీద సెప్టెంబర్ క్వార్టర్‌లో -4.18 శాతం, జూన్ లో -3.95శాతం, మార్చ్ లో -1.61శాతం నష్టపోయాయి. FIIల పెట్టుబడులు కూడా సెప్టెంబర్ క్వార్టర్‌లో -6.53శాతం, జూన్ త్రైమాసికంలో -6.27శాతం, మార్చ్ లో -2.65శాతం నష్టపోయాయి. వార్షిక లాస్ (YTD) వచ్చేసి 33.86శాతంగా ఉంది. 
సన్ ఫార్మా:
మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్స్ లో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ సెప్టెంబర్ క్వార్టర్‌లో -8.75శాతం, జూన్ లో -8.50శాతం, మార్చ్‌లో -8.22శాతంగా ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి ఈ స్టాక్‌లో సెప్టెంబర్ త్రైమాసికానికి -16.78శాతంగా, జూన్ క్వార్టర్‌లో -16.4శాతంగా, మార్చ్‌లో -16.32 శాతం నష్టపోయాయి. YTD లాస్ 25.81శాతంగా ఉంది.
అంబుజా సిమెంట్స్ :
MFల పెట్టుబడులు ఈ స్టాక్ మీద సెప్టెంబర్ క్వార్టర్‌లో -5.19శాతం, జూన్ క్వార్టర్‌లో -5.71శాతం, మార్చ్‌ 4.84శాతం నష్టపోయాయి. FIIల పెట్టుబడులు కూడా సెప్టెంబర్ క్వార్టర్‌లో -17.33శాతం, జూన్ లో -16.51శాతం, మార్చ్‌లో -16.45శాతం నష్టపోయాయి. వార్షిక నష్టం (YTD) 21.07శాతంగా ఉంది.
Schneider ఎలక్ట్రిక్ ఇన్ఫ్రా :
MF ల పెట్టుబడులు సెప్టెంబర్ త్రైమాసికంలో -7.22శాతం, జూన్ లో -6.83శాతం, మార్చ్‌ క్వార్టర్‌లో -6.79శాతం నష్టపోయాయి. FIIల ఇన్వెస్ట్‌మెంట్లు కూడా సెప్టెంబర్ క్వార్టర్‌లో -0.26శాతం, జూన్‌లో -0.23శాతం , మార్చ్ లో -0.21శాతం నష్టపోయాయి. వార్షిక లాస్ వచ్చేసి 20.54శాతంగా ఉంది. 
NHPC:
మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్‌లో పెట్టిన పెట్టుబడుల మీద సెప్టెంబర్ క్వార్టర్‌లో 2.96శాతం, జూన్ లో -2.87, మార్చ్‌లో -2.58శాతం నష్టం వాటిల్లింది. FIIల పెట్టుబడులు కూడా సెప్టెంబర్ క్వార్టర్‌లో -4.49శాతం, జూన్ లో -4.45శాతం, మార్చ్‌లో -4.3శాతం నష్టపోయాయి. వార్షిక నష్టం (YTD) 20.52శాతంగా ఉంది. 
మహానగర్ గ్యాస్ :
ఈ స్టాక్ మీద మ్యూచువల్ ఫండ్స్ పెట్టిన పెట్టుబడులు సెప్టెంబర్ క్వార్టర్‌లో -8.75 శాతం, జూన్ క్వార్టర్‌లో -5.34శాతం, మార్చ్‌లో -3.91శాతం నష్టపోయాయి. FIIల పెట్టుబడులు సెప్టెంబర్ క్వార్టర్‌లో -19.03శాతం, జూన్‌లో -12.7శాతం, మార్చ్‌లో -9.68శాతం నష్టపోయాయి. వార్షిక నష్టం చూస్తే.. 20.03శాతంగా ఉంది. 
ICICI ప్రుడెన్షియల్ లైఫ్‌ ఇన్సూరెన్స్ ;
ఈ స్టాక్ మీద MFల పెట్టుబుడులు సెప్టెంబర్ త్రైమాసికంలో -3.70శాతం, జూన్ క్వార్టర్‌లో -3.66శాతం, మార్చ్‌ లో -2.88శాతం నష్టపోయాయి. FIIల పెట్టుబడులు కూడా సెప్టెంబర్ క్వార్టర్‌లో -8.86శాతం, జూన్‌లో -8.47శాతం, మార్చ్‌లో -6.52శాతం నష్టపోయాయి. వార్షిక YTD నష్టం 15.46శాతంగా ఉంది. 
హెడిల్ బర్గ్ సిమెంట్ ఇండియా:
MFల పెట్టుబడులు సెప్టెంబర్ క్వార్టర్‌లో -3.45శాతం, జూన్‌లో 3.15శాతం, మార్చ్‌లో 3.14శాతం నష్టపోయాయి. FIIల ఇన్వెస్ట్‌మెంట్లు కూడా సెప్టెంబర్ త్రైమాసికంలో -11.97శాతం, జూన్‌లో -11.74శాతం, మార్చ్‌లో -11.63శాతం నష్టపోయాయి. వార్షిక నష్టం YTD ప్రకారం 1.27శాతంగా ఉంది. 


 Most Popular