ఎట్టకేలకు పతంజలిపై ఎఫ్ఎంసిజి సంస్థల విజయం

ఎట్టకేలకు పతంజలిపై ఎఫ్ఎంసిజి సంస్థల విజయం

ఎఫ్ఎంసిజి సంస్థలు ఎట్టకేలకు పతంజలిపై చాలాకాలం తర్వాత విజయాన్ని సాధించాయి. మార్చి 2018 నాటికి పతంజలి సంస్థ అమ్మకాలు, లాభాల్లో నెగిటివ్ గ్రోత్‌ను నమోదు చేసింది. కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోవడం, నేచురల్ ప్రోడక్టులతో ఎంఎన్‌సీలు మార్కెట్లను ముంచెత్తడం వంటివి కూడా ఇతర ఎఫ్ఎంసీజీ సంస్థలకు కలిసొచ్చింది. జీఎస్టీ అమలు తర్వాత కొద్దిగా కాస్ట్ అడ్వాంటేజ్ తీసుకుని ముందడుగు వేశాయి కంపెనీలు. 

2016-17లో రూ.9030 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిన సంస్థ గత ఏడాదిలో రూ.8135 కోట్ల రెవెన్యూకు పరిమితమైంది. పతంజలి లాభం కూడా రూ.1190 కోట్ల నుంచి రూ.529 కోట్లకు దిగొచ్చింది. 

2013 నుంచి పెరగడమే తప్ప తిరోగమనం అంటూ చూడని పతంజలి సంస్థకు ఇదో గట్టిషాక్ లాంటిది. త్వరలో ఐపీఓకు వచ్చే యోచనలో ఉన్న సంస్థకు ఈ న్యూస్ నెగిటివ్ అంశమే అయినా కన్సాలిడేషనే ఇందుకు కారణమని యాజమాన్యం చెబ్తేంది. Most Popular