7 కోట్ల మంది కస్టమర్లను కోల్పోనున్న ఎయిర్ టెల్ ..?

7 కోట్ల మంది కస్టమర్లను కోల్పోనున్న ఎయిర్ టెల్ ..?

ఇప్పటికే.. జియో దెబ్బకు విలవిలలాడుతున్న ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లలో ప్రధాన ఆపరేటర్‌ అయిన ఎయిర్ టెల్ తనకున్న కస్టమర్లలో సుమారు 50-70 మిలియన్ల కస్టమర్లను కోల్పోనుందా? అవుననే అంటున్నారు టెలికాం విశ్లేషకులు. జీవిత కాల ఫ్రీ ఇన్‌కం ప్లాన్‌లో ఉన్న కస్టమర్లను నెలకు మినిమమ్ బ్యాలెన్స్ రూ. 35 గా ఎయిర్ టెల్ నిర్ణయించింది. తాజాగా తన కస్టమర్లకు నెలకు మినిమమ్ రీఛార్జ్ చేయించుకోమనీ,లేదా కనెక్షన్‌ను కట్ చేస్తానని తాఖీదులు కూడా పంపింది. దీంతో చాలా మంది కస్టమర్లు ఎయిర్‌టెల్‌ను వీడనున్నారని సమాచారం. 
నష్టం లేదంటున్న ఎయిర్ టెల్ 
నెలకు సగటున రూ. 35 కూడా వాడని కస్టమర్ల కనెక్షన్లను రద్దు చేయనున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. దీని వల్ల సబ్‌స్ర్కైబర్లను కోల్పోతారు కదా అన్న ప్రశ్నకు .. ఈ చర్య వల్ల యావరేజ్ రెవిన్యూ పర్ యూజర్ (సగటు వినియోగదారుని నుండి వచ్చే ఆదాయం) ARPU  , పెరుగుతుందని, ఇప్పటికే చాలా సిమ్‌లు లైఫ్ టైం ప్యాకేజ్ కింద కేవలం ఇన్‌కమింగ్ కాల్స్ కోసమే వాడుతున్నారని , దీన్ని అరికట్టడానికే ఈ చర్య తీసుకున్నామని ఎయిర్ టెల్ తెలిపింది. ఈ లైఫ్ టైం ప్యాకేజ్ సిమ్ములను రెండో ఫోన్ కిందే వాడుతున్నారని, అయినప్పటికీ.. ఒక వేళ కస్టమర్లు తగ్గినా ఆ భారాన్ని మేం మోయడానికే సిద్ధ పడ్డామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇలా నష్టపోయినా.. మిగతా మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామని.. , 4G సేవలతో బాటు , ఇతర రంగాల్లో నుంచి తమకు ఆదాయం రానుందని ఎయిర్ టెల్ పేర్కొంది. మరి కొత్త కస్టమర్లను ఎలా సంపాదించుకుంటారన్న దానిపై వివరణను దాట వేసింది. ఈ సంవత్సరం అక్టోబర్ నాటి నుండే ప్రీపేయిట్ కస్టమర్లకు ఫ్రీ అవుట్ గోయింగ్ సదుపాయాన్ని రద్దు చేసింది ఎయిర్ టెల్. నెలకు కనీసం రూ. 35 రీఛార్జ్ చేసుకుంటేనే ఆ సదుపాయం వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం లైఫ్ టైం ప్యాకేజ్‌ను ఉపయోగిస్తున్న సుమారు 7 కోట్ల మందిలో 50 శాతం కస్టమర్లు నెలకు రూ. 35 రీచార్జ్ చేసుకున్నా ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్నది ఎయిర్ టెల్ వాదనలా కనిపిస్తుంది. ప్రీపేయిడ్ కస్టమర్లకు సరికొత్త ప్లాన్లు, టారిఫ్‌లు రూపొందించనున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. నెలకు కనీస రీఛార్జ్ తో ARPU  రెవెన్యూను పెంచుకోడానికి చర్యలు తీసుకుంటుంది. 

Image result for vodafone idea
వోడాఫోన్-ఐడియా కూడా అదే బాటలో...
ఇప్పటికే వోడాఫోన్-ఐడియా కంపెనీ తన ఫ్రీ ప్యాకేజ్‌లను నిలిపి వేసింది. ఎయిర్ టెల్ , వోడాఫోన్ కంపెనీలు ఇలా హటాత్తుగా ప్రీపేయిడ్ సర్వీసుల్లోని ప్లాన్లను అర్ధంతరంగా నిలిపివేయడాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటి (TRAI )  తప్పు పట్టింది. కస్టమర్లకు అందించే సర్వీసుల వివరాలు పారదర్శకంగా ఉండాలని ట్రాయ్ చెప్పినప్పటికీ..గత 6 నెలల క్రితం ఉన్న సర్వీసుల్లో మార్పులు చేర్పులు చేపట్టాయి టెలికాం కంపెనీలు. 2016లో జియో రంగ ప్రవేశం చేసినప్పటి నుండి ఎయిర్ టెల్, వోడాఫోన్ -ఐడియా కంపెనీల సగటు వినియోగదారుడి నుండి వచ్చే ఆదాయం (ARPU) శాతం బాగా తగ్గిపోయింది. ఇది ఎయిర్ టెల్‌కు రూ. 100 గా ఉండగా, వోడాఫోన్ -ఐడియాకు రూ. 88గా మాత్రమే ఉంది. అదే  రిలయన్స్ జియోకు మాత్రం ARPU నెలకు రూ. 131గా ఉండటం గమనార్హం. ఇప్పటికే .. సెంట్రల్ రైల్వే వినియోగదారులను పోగొట్టుకున్న ఎయిర్ టెల్‌కు కొత్త కస్టమర్లు రావడం కొంచెం కష్టమేనని టెలికాం విశ్లేషకులు భావిస్తున్నారు. 


 Most Popular