7 బ్యాంకులకు రూ.28000 కోట్లు.. లాభాల్లో పీఎస్‌యూ బ్యాంక్స్

7 బ్యాంకులకు రూ.28000 కోట్లు.. లాభాల్లో పీఎస్‌యూ బ్యాంక్స్

ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం సుమారు రూ.28615 కోట్ల మూలధనాన్ని అందించబోతోంది. ఈ రోజు అందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మూలధనాన్ని అందుకోబోతున్న బ్యాంకుల జాబితాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, సిండికెట్ బ్యాంక్ ఉన్నాయి. 

ఉన్న ఈ  జాబితాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా గరిష్టంగా రూ.10086 కోట్లు అందుకోవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ రూ.1678 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2159 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ రూ.5500 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.4498 కోట్లు, యూకో బ్యాంక్ రూ.3056 కోట్లు, సిండికెట్ బ్యాంక్ రూ.1638 కోట్ల మూలధనాన్ని అందుకోవచ్చు. 

ఈ వార్తల నేపధ్యంలో సెంట్రల్ బ్యాంక్ 5 శాతం వరకూ లాభపడింది. మిగిలిన స్టాక్స్ కూడా స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. 


 Most Popular