MACD ఛార్టుల్లో  పతనం అంచున 89 స్టాక్స్...! 

MACD ఛార్టుల్లో  పతనం అంచున 89 స్టాక్స్...! 

మార్కెట్ ఛార్టుల్లో గత నాలుగు సెషన్స్ లో NSE కి చెందిన దాదాపు 89 స్టాక్స్ పతనం అంచున నిలిచాయి. వీటిలో దేశీయ టాప్ 3 బ్యాంకులు, బయోకాన్, మారుతీ, CEAT వంటి కంపెనీలు కూడా ఉండటం గమనార్హం. గ్లోబల్ మార్కెట్ల సెంటిమెంట్లు, అమెరికా పరిణామాలు, ఆసియా మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. ఇందుకు భారత్ కూడా మినహాయింపు కాదు. దేశీయంగా మార్కెట్ డైలీ ఛార్టుల్లో  మూవింగ్ ఏవరేజ్ కన్వర్జెన్స్, డైవర్జెన్స్ (MACD) ఇండికేటర్ కదలికలను బట్టి దాదాపు నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లోని 89 స్టాక్స్ నష్టాల బాటలో ఉన్నాయి. నిఫ్టీ 50 బెంచ్ మార్క్ 4శాతం నష్టపోయింది గత 4 సీజన్లలో. ఇది ఇంకా కొనసాగుతుందనే ఎనలిస్టులు భావిస్తున్నారు. టెక్నికల్ ఇండికేటర్స్ ఈ స్టాక్స్ మరింత పడిపోన్నాయనే సిగ్నల్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఛార్టులు బేరిష్ సిగ్నల్స్ ను ఇండికేట్ చేస్తున్నాయి. ఈ స్టాక్స్‌లో ఒక బలమైన  ట్రేడింగ్ వాల్యూమ్ అనేది  చాలా ఆలస్యంగా జరగడం మనం గమనించవచ్చు. ఈ పతనం మరి కొంత కాలం జరగొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. 

MACD crossed below signal 1

courtesy by: economicstimes
ఛార్టుల్లో వీక్‌గా ఉన్న స్టాక్స్ ఇవే...
ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజాలైన ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, RBL బ్యాంక్, ఫార్మా కంపెనీలైన వోక్‌హార్డ్, బయోకాన్, స్ట్రైడ్స్ ఫార్మా, FMCG రంగంలోని జూబిలెంట్ ఫుడ్ వర్క్, బ్రిటానియా ఇండస్ట్రీస్, రాడికో ఖైతాన్, ఆటో రంగంలోని మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో , CEAT వంటి స్టాక్స్ MACD ప్రకారం డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. వీటితో బాటు ICICI సెక్యూరిటీస్, PVR, ఎరోస్ ఇంటర్నేషనల్, పూర్వాంకర, హెడిల్ బర్గ్ సిమెంట్, మిండా ఇండస్ట్రీస్, క్వూయిస్ కార్ప్, అపోలో మైక్రో సిస్టమ్స్ , ఫ్యూచర్ లైఫ్ స్టైల్ , వర్ల్‌పూల్ ఇండియా వంటివి కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి.  ఈ కంపెనీల స్టాక్స్ అన్నీ బేరిష్ ట్రెండ్‌లోనే కొనసాగడం గమనార్హం. 
ఛార్టుల్లో ముందంజ వేసిన స్టాక్స్ ఇవే..
అయితే డైలీ ఛార్టుల్లో బుల్లిష్ క్రాస్‌ఓవర్‌ను అధిగమించిన స్టాక్స్ కూడా ఉన్నాయి. MACD ని క్రాస్ చేసిన కంపెనీల్లో రుచి సోయా ఇండస్ట్రీస్, మన్ పసంద్ బేవరేజెస్, PI ఇండస్ట్రీస్, లా ఒపాలా RG, GE పవర్ ఇండియా వంటి స్టాక్స్ ఛార్టుల్లో  దూకుడుగా ఉన్నాయి. 
MACD crossed above signal (1)

courtesy by : economicstimes
అయితే.. ఛార్టులను చూసి అప్పుడే ఒక అంచనాకు రాకూడదని ఎనలిస్టులు అంటున్నారు. MACD ఇండికేటర్ లైన్‌ను మాత్రమే చూడొద్దనీ, దాని ఆధారంగా ఒక విశ్లేషకుడు స్టాక్స్ విషయంలో బై లేదా సెల్ పిలుపును ఇవ్వలేడని.. ఒక విలువ ఆధారంగా, లేదా నిష్పత్తి ఆధారంగా ట్రేడింగ్ కాల్ లేదా సిఫారసును చేయలేడని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొంటున్నాయి. ట్రేడర్స్ కూడా ఒక్క MACD లైన్‌ను మాత్రమే చూడకుండా,, ఛార్టుల్లో మిగతా అంశాలైన రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ RSI , బోలింగర్ బాండ్స్, ఫైబోనాక్సీ సిరీస్, క్యాండిల్ స్టిక్స్ ప్యాట్రన్స్, యాధృచ్ఛిక సూచీల వంటివి పరిశీలించి నిర్ధారణకు రావాల్సి ఉంటుందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు.  ఈ నెలలో నిఫ్టీ 50లో మూవింగ్ ఎవరేజెస్ దాదాపు 3 సార్లు అడ్డంగా నిలువుగా డౌన్‌ గ్రేడ్ వైపు పయనించాయి. ఇది గ్రాఫ్‌లో చాలా అసాధరణంగా జరిగేదని, ఇలా జరిగినప్పుడు బుల్స్ , బేర్స్ రెండు సమాన అవకాశాలు కలిగి ఉంటాయని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. చాలా వరకూ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు డౌన్‌ ట్రెండ్‌లో నడుస్తున్నా... స్టాప్‌ఓవర్ మద్దతుకు చేరువ అవుతన్నాయనే చెప్పొచ్చు. ఇలాంటి సమయంలోనే బేర్స్ ముందుకు దూసుకెళ్లడానికి యత్నిస్తారని JM ఫైనాన్షియల్స్ సంస్థ పేర్కొంది. ఈ సమయంలో  షార్ట్ టర్మ్ ప్రాతిపదికన కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో స్టాక్స్ ను ఎంపిక చేసుకోమని BNP పారిబాస్ సంస్థ మదుపర్లకు సూచిస్తుంది. 

Image result for macd chartMost Popular