జూబిలెంట్‌ ఫుడ్‌కు ఆన్‌లైన్‌ మంట!

జూబిలెంట్‌ ఫుడ్‌కు ఆన్‌లైన్‌ మంట!

గత వారం ఉన్నట్టుండి పతనబాట పట్టిన జూబిలెంట్‌ పుడ్‌వర్క్స్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లు వరుసగా మూడో రోజు అమ్మకాలకు దిగడంతో ఈ కౌంటర్‌ కళతప్పింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5.4 శాతం పతనమై రూ. 1153 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1212 వద్ద గరిష్టాన్నీ, రూ. 1146 దిగువన కనిష్టాన్నీ తాకింది. డోమినోస్‌ పిజ్లా స్టోర్లను నిర్వహించే జూబిలెంట్‌ ఫుడ్‌ షేరు గత రెండు రోజుల్లోనూ 10 శాతం దిగజారింది. ఇతర వివరాలు చూద్దాం..

Image result for swiggy and zomato

కారణాలున్నాయ్‌
ఇటీవల కంపెనీ ఉద్యోగ వ్యయాలు పెరగడం, ఫుడ్‌ డెలివరీ సంస్థల ద్వారా స్థానిక సంస్థల నుంచి పోటీ తీవ్రతరంకావడం వంటి అంశాలు జూబిలెంట్‌ ఫుడ్‌ కౌంటర్లో అమ్మకాలకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత వారం ఫుడ్‌ ఆర్డరింగ్‌ సేవల సంస్థ స్విగ్గీ దక్షిణాఫ్రికా దిగ్గజం నాస్పర్స్‌ నుంచి 100 కోట్ల డాలర్ల(రూ. 7000 కోట్లు) నిధులను అందుకున్న సంగతి తెలిసిందే. ఇతర ఆన్‌లైన్‌ ఫుడ్‌ సర్వీసుల సంస్థలు జొమాటో, ఫుడ్‌ పాండా, ఉబర్‌ ఈట్స్‌ తదితరాలు పలు పట్టణాలలో సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో పోటీ పెరుగుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో కంపెనీ మార్కెటింగ్‌ వ్యయాలు సైతం పెరుగుతున్నట్లు వివరించారు. దీనికితోడు ఇటీవల స్టాక్ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న కారణంగా ఇన్వెస్టర్లు జూబిలెంట్‌ కౌంటర్లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్నట్లు తెలియజేశారు.Most Popular