2019లో భారతీయ మార్కెట్లే బెస్ట్‌ అంటున్న సర్వేలు

2019లో భారతీయ మార్కెట్లే బెస్ట్‌ అంటున్న సర్వేలు

2018 దేశీయ మార్కెట్లకు కలిసిరాలేదనే చెప్పాలి. రూపీ మారకపు విలువ పతనం, IL&FS సంక్షోభం, వడ్డీరేట్ల వ్యవహారాలు.. , క్రూడ్ ఆయిల్ ధరల కదలికలు ఇవ్వన్నీ... స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాలను కుదేలు చేశాయి. కానీ.. 2019 మాత్రం ఎర్నింగ్ మార్జిన్లకు దేశీయ మార్కెట్లు నిలయంగా మారనున్నాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌కు భారత్ అనువైన స్థానం అని వారు పేర్కొంటున్నారు. గ్లోబల్ అంచనాల ప్రకారం...2019 లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం రెండవ అత్యంత ప్రాధాన్యత గల పెట్టుబడుల గమ్యస్థానంగా ఉంది, తరువాత స్థానంలో  బ్రెజిల్ నిలిచింది. 
అమెరికా కార్పోరేట్ గ్రోత్‌ను US ఫెడ్ నిర్ణయిస్తుంది. కానీ.. ప్రస్తుతం US ఫెడరల్ రిజర్వ్ తన దూకుడును తగ్గించింది. ఈ పరిస్థితుల్లో విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఒక లాభాలు సంపాదించిపెట్టే మంత్రదండంగా కనబడుతుంది. ఇండియాలో ఆదాయ విస్తరణ, సహేతుక విలువలు పెట్టుబడిదారులను రానున్న కొత్త సంవత్సరంలో ఇటు వైపు రావడానికి ప్రేరేపిస్తున్నాయి. 2019లో భారతదేశం ఎర్నింగ్  గ్రోత్ రేటు  27శాతం ఉంటుందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఇది బ్రెజిల్‌లో 19.5శాతంగా మాత్రమే ఉండటం గమనార్హం. ఎర్నింగ్స్ పునరుద్ధరణ భారతీయ మార్కెట్లలో క్లిష్టమైన విషయంగా ఉన్నప్పటికీ.. రానున్న 2019లో 10-15 శాతం రిటర్న్స్ దేశీయ మార్కెట్లలో సాధ్యమేనని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సంస్థ అంచనా వేస్తుంది. అలాగే.. 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్లను స్థిర పరచవచ్చని మోర్గాన్ స్టాన్లీ సంస్థ భావిస్తుంది. ఒకవేళ జరగబోయే ఎన్నికల్లో ఓటర్లు సంకీర్ణం వైపే మొగ్గు చూపితే తప్ప మార్కెట్లు నిలకడగానే ఉంటాయని మోర్గాన్ స్టాన్లీ అంచనా. అంటే స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే.. మార్కెట్లు స్థిరమైన లాభాలు చూపిస్తాయని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. 

'ఇండియా బెస్ట్' అంటున్న  చెబుతున్న సర్వేలు..!
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలైన ఆముంది అసెట్స్ మేనేజ్‌మెంట్, ఫిడెలిటీ ఇంటర్నేషనల్, న్యూబెర్గర్ బెర్మన్, వొంటోబెల్ అసెట్స్ వంటి కంపెనీలు ఇన్వెస్టర్లతో కలిసి చేసిన సర్వే ప్రకారం 2019 సంవత్సరం భారత్ లో పెట్టుబడులు సురక్షితమని , ప్రాఫిట్ ఎర్నింగ్స్ ఇక్కడే ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నాయి. సంస్థాగత మదుపర్లు భారత్‌ను లక్ష్యంగా చేసుకోవచ్చని సూచిస్తున్నాయి. మోస్ట్ ప్రిఫర్డ్ ఎమర్జింగ్ మార్కెట్లుగా బ్రెజిల్, ఇండియా, ఇండోనేషియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అర్జెంటీనా, రష్యా, మెక్సికో, సౌత్ కొరియాలను ఈ సర్వేలో గుర్తించారు. ఇందులో అత్యధికంగా ఎర్నింగ్ గ్రోత్ వచ్చే దేశంగా భారత్‌ను ఎంపిక చేశారు సర్వే నిర్వాహకులు. దాదాపు 26.6శాతం ఎర్నింగ్ గ్రోత్ భారత్‌లో ఉండొచ్చని సర్వే ఫలితాలు చూపిస్తున్నాయి. 

India snip 1
 Courtesy by: economicstimes.
 Most Popular