నేలచూపులో గ్రాఫైట్‌ ఇండియా!

నేలచూపులో గ్రాఫైట్‌ ఇండియా!

ఎలక్ట్రోడ్స్‌ తయారీ దిగ్గజం గ్రాఫైట్‌ ఇండియా కౌంటర్‌ ఇటీవల కొద్ది రోజులుగా నేలచూపులకే పరిమితమవుతోంది. ఈ బాటలో మరోసారి ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపుతుండటంతో తాజాగా ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పతనమైంది. అమ్మేవాళ్ల స్థాయిలో కొనుగోలుదారులు కరవుకావడంతో రూ. 40 క్షీణించి రూ. 755 దిగువన ట్రేడవుతోంది. అయితే గత ముగింపు రూ. 795తో పోలిస్తే తొలుత ఒక దశలో రూ. 800 వరకూ ఎగసింది. 

ఇతర వివరాలు చూద్దాం
గ్రాఫైట్‌ ఇండియా కౌంటర్‌ గత నాలుగు రోజుల్లో 11 శాతం వెనకడుగు వేసింది. ఇందుకు బెంగళూరులోని ఎలక్ట్రోడ్స్‌ తయారీ ప్లాంటు కారణమవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు మరోప్రాంతానికి తరలించే షరతుతో బెంగళూరు ప్లాంటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో కంపెనీ 2020 జూన్‌కల్లా ఈ ప్లాంటును పూర్తిగా తరలించాల్సి ఉంటుంది. కాగా.. ఇటీవల ప్రపంచ ఆర్థిక మందగమన సంకేతాలు సైతం ఈ కౌంటర్‌పై ప్రభావం చూపుతున్నట్లు మరికొంతమంది నిపుణులు పేర్కొంటున్నారు.

Image result for graphite electrode

చైనాసహా ప్రపంచ దేశాలలో స్టీల్‌ వినియోగం మందగిస్తే.. గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌కు డిమాండ్‌ క్షీణిస్తుందని చెబుతున్నారు. ఇలాంటి పలు అంశాలు ఈ కౌంటర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. ఏడాది కాలంలో ఈ కౌంటర్ అనూహ్య ర్యాలీ చేసిన కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌ 14కల్లా గ్రాఫైట్‌ ఇండియా షేరు రూ. 1126 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే.Most Popular