రైతు రుణమాఫీలు ఈ కంపెనీలకు నిజంగా ఓ వరం !!

రైతు రుణమాఫీలు ఈ కంపెనీలకు నిజంగా ఓ వరం !!

సాధారణంగా రుణ మాఫీలు, సబ్సీడీల వల్ల ఎవరికి నష్టం ఉంటుందంటే.. ఆయా రుణాలు ఇచ్చిన ఆర్ధిక సంస్థలు, బ్యాంకుల వంటి వాటికే నష్టం ఉంటుంది. ఈ రుణ మాఫీల వల్ల ఆర్ధిక వ్యవస్థ కూడా కాస్త ఒడుదిడుకలను ఎదుర్కొంటుంది. మరి రైతులకు ఇచ్చిన రుణమాఫీల వల్ల రైతుల తోబాటు మరి కొంతమంది లాభపడుతున్నారు. వారెవరవరో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే..ఇది చదవండి .
అంతర్జాతీయ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ స్యూయిస్ అంచనా ప్రకారం దేశంలో జారీ అవుతున్న రుణ మాఫీల వల్ల రైతులతోబాటు.. ప్రముఖ ట్రాక్టర్ కంపెనీలకు కూడా లాభాలు వస్తున్నాయట. దేశంలో ప్రముఖ ట్రాక్టర్ తయారీ సంస్థలైన మహీంద్ర&మహీంద్ర, ఎస్కార్ట్స్ వంటి కంపెనీలు ఈ రుణ మాఫీల వల్ల లాభాల్లోకి వస్తున్నాయంటూ.. క్రెడిట్ స్యూయిస్ పేర్కొంది. ఇది చదవడానికి కాస్త వింతగా ఉన్నా.. విషయం మాత్రం వాస్తవమే. 
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లోని రైతులకు రుణ మాఫీ ప్రకటించగానే.. అక్కడ దుక్కి దున్నే ట్రాక్టర్లకు 25శాతం డిమాండ్ పెరిగింది. గత సంవత్సరం మహరాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక,  పంజాబ్‌లలో కూడా రైతులకు రుణమాఫీని ప్రకటించడం జరిగింది. అక్కడ కూడా ట్రాక్టర్లకు డిమాండ్ పెరగడం జరిగిందని క్రెడిట్ స్యూయిస్ పేర్కొంది. రైతులకు రుణమాఫీ కావడంతో వారు మరింతగా తమ వ్యవసాయానికి పెట్టుబడులు పెడుతున్నారని, దీనితో బాటు సేద్యానికి యంత్ర పరికరాల కొనుగోళ్ళపై ఆసక్తి చూపుతున్నారని క్రెడిట్ స్యూయిస్ పేర్కొంది. అత్యధికంగా రుణ మాఫీలు చేసిన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రల్లో ట్రాక్టర్లకు డిమాండ్ అధికంగా పెరిగింది. 

Image result for escort tractor logo
ఎస్కార్ట్స్ కంపెనీకి క్రెడిట్ స్యూయిస్ ' అవుట్ పెర్ఫార్మింగ్' రేటింగ్స్ ను ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ రూ. 1,050 గా పేర్కొంది. దేశంలో ట్రాక్టర్ల డిమాండ్ పెరగడాన్ని ఎస్కార్ట్ సొమ్ము చేసుకుంటుందని,  ఇదే కాకుండా రైల్వే కన్‌స్ట్రక్షన్ నిర్మాణ పరికరాల తయారీ అమ్మకాలు కూడా గణనీయంగా పెరగనున్నాయని క్రెడిట్ స్యూయిస్ భావిస్తుంది. 
మహీంద్ర&మహీంద్ర కంపెనీకి కూడా క్రెడిట్ స్యూయిస్ ' అవుట్‌పెర్ఫార్మింగ్ ' రేటింగ్‌ను ఇచ్చింది. టార్గెట్ ప్రైస్‌ రూ. 1,020గా పేర్కొంది. యుటిలిటీ వెహికిల్స్, ట్రాక్టర్స్ అమ్మకాల్లో గణనీయ వృద్ధిని మహీంద్ర కనబరచనుందని క్రెడిట్ స్యూయిస్ భావిస్తుంది.
    
Image result for mahindra & mahindra logoMost Popular