3 వారాల్లో ముచ్చటైన లాభాలు పంచే స్టాక్స్ ఇవి..!

3 వారాల్లో ముచ్చటైన లాభాలు పంచే స్టాక్స్ ఇవి..!

నేటి సోమవారం మార్కెట్లు , గ్లోబల్ మార్కెట్ల ప్రభావానికి లోనై ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. నిఫ్టీ , సెన్సెక్స్  సూచీలు లోయర్ లైన్‌లో ట్రేడ్ అయ్యాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీన పరుస్తూ..అంతర్జాతీయ మార్కట్ల ఒడిదిడుకులు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఒక్క ఇన్ఫోసిస్, TCS, SBI మాత్రమే గెయినర్లుగా మిగిలాయి. ఈ డిసెంబర్ నెల ప్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్‌ ఎక్స్పైరీలోని ఒడుదిడుకులకు దేశీయ మార్కెట్లు సాక్షీభూతంగా నిలిచాయి. వీటిని అధిగమిస్తూ.. రానున్న మూడు వారాల్లో కొన్ని స్టాక్స్ లాభాలను ఆర్జించగలవని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టులు పేర్కొంటున్నారు. అవేంటో చూద్దాం.

Image result for cg power and industrial solutions
CG పవర్ &ఇండస్ట్రియల్ సొల్యూషన్స్: బై రేటింగ్స్ : టార్గెట్ ప్రైస్.రూ.49: స్టాప్ లాస్ రూ.39
లోయర్ టైం ఫ్రేం ఛార్టుల్లో ఈ కౌంటర్ బై సిగ్నల్స్ ను చూపిస్తుంది. మ్యాసివ్ వాల్యూమ్స్ లో మంచి బ్రేక్ అవుట్‌ను కనబరుస్తుంది CG పవర్ స్టాక్. ఛార్ట్‌లో రూ. 40 కి దగ్గరగా వెళ్ళిన ఈ స్టాక్ టార్గెట్ ప్రైస్‌ రూ. 49 ని రీచ్‌ అవుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఇనిషియల్ టార్గెట్ రూ. 49 గా  సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ స్టాక్‌ను కొనుగోలు చేయొచ్చని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొంటున్నాయి. 

Image result for irb infrastructure
IRB ఇన్ఫ్రా: బై : టార్గెట్ ప్రైస్.రూ.181: స్టాప్ లాస్ రూ. 149
గత రెసిస్టెన్స్ లెవల్ వద్ద నుండి IRB ఇన్ఫ్రా స్టాక్ స్థిరంగా క్రమ పద్దతిలో పెరుగుతూ వస్తుంది. ఈస్టాక్ గమనంలో ఒక అప్‌ ట్రెండ్ కనబడుతోంది. గత అక్టోబర్ 26న బాటమ్ ట్రెండ్ రూ. 117గా ఉన్న ఈ స్టాక్ క్రమంగా పుంజుకోడం మనం గమనించవచ్చు.  బ్రోకరేజ్ సంస్థల సూచనల ప్రకారం IRB ఇన్ఫ్రా షేర్‌కు బై రేటింగ్స్ ఉన్నాయి. టార్గెట్ ప్రైస్‌గా రూ. 181 గా పేర్కొన్నారు. ఒక వేళ ఇది రానున్న మూడు వారాల్లో టార్గెట్ ప్రైస్‌ను చేరుకుంటే.. రూ. 200 వరకూ ఈ స్టాక్ పెరగొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.

 Image result for tata motors
టాటా మోటార్స్ : బై : టార్గెట్ ప్రైస్ .రూ. 195: స్టాప్ లాస్ రూ. 165
డైలీ ఛార్టుల్లో బాటమ్ నుండి క్రమంగా కోలుకున్న స్టాక్ టాటా మోటార్స్ మాత్రమే. గత అక్టోబర్ 26 న రూ. 117గా ఉన్న ఈ స్టాక్ క్రమంగా పుజుకుంటుంది. టాటా మోటర్స్ స్టాక్‌ను బై ఆన్ డిప్స్ గా పేర్కొంటున్నారు ఎనలిస్టులు. ఈ స్టాక్ మూవింగ్ ఎవరేజ్ 50 DMA, 34 WMA గా ఉన్నాయి. దీని RSI పాజిటివ్‌గా ఉండటంతో బాటు.. ఈ నెలలోనే రైజింగ్ పొటెన్సియాలిటీ చూపిస్తుంది. అందుకే.. ఎనలిస్టులు టాటా మోటార్స్ టార్గెట్ ప్రైస్‌ రూ. 195గా పేర్కొంటున్నారు.

 Image result for tata global beverages
టాటా గ్లోబల్ బేవరేజెస్ : బై : టార్గెట్ ప్రైస్ రూ. 225: స్టాప్ లాస్ రూ. 208
డైలీ ఛార్టుల్లో ఫాలింగ్ ఛానెల్ నుండి బ్రేక్ అవుట్ సాధించింది టాటా గ్లోబల్ బేవరేజెస్. వీక్లీ ఛార్టుల్లో బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్‌ను( పియర్సింగ్ ప్యాట్రన్ )  కనబరిచింది టాటా గ్లోబల్ బేవరేజెస్. అందుకే ఎనలిస్టులు దీనికి బై రేటింగ్స్‌తో బాటు టార్గెట్ ప్రైస్‌ రూ. 225గా పేర్కొన్నారు. 

Image result for MMTC
MMTC: బై : టార్గెట్ ప్రైస్ రూ. 33.50 : స్టాప్ లాస్ రూ. 28
ఈ స్టాక్ ఛార్టుల్లో మంచి మూమెంటమ్ ఇండికేటర్స్ ను ప్రదర్శిస్తుంది. బై క్రాస్‌ఓవర్‌ను చేరుకున్న MMTC స్టాక్స్ కు ఎనలిస్టులు బై రేటింగ్స్ తో బాటు , టార్గెట్ ప్రైస్‌ రూ. 33.50 గా పేర్కొంటున్నారు. షార్ట్‌ టర్మ్ కోసం ఈ స్టాక్ గ్రాఫ్స్ టెప్టింగ్‌గా ఉన్నాయని ఎనలిస్టులు అంటున్నారు.  


Disclaimer: పైన సూచించిన అభిప్రాయాలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, వాటి ఎనలిస్టులు ఇచ్చినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి. Most Popular