భవిష్యత్తులో ఎలక్ట్రిక్, గ్యాస్ వాహనాలదే హవా..!!

భవిష్యత్తులో ఎలక్ట్రిక్, గ్యాస్ వాహనాలదే హవా..!!

2030 కల్లా.. దేశ వ్యాప్తంగా గ్యాస్ , విద్యుత్‌తో నడిచే వాహనాలు మాత్రమే రోడ్ల మీద ఉండాలన్నది ప్రభుత్వ సంకల్పం. పర్యావరణంలో పెట్రోల్, డీజీల్ హానికారక కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి కాబట్టి ఇకపై వీటి వాడకంపై నియంత్రణలు విధించబోతున్నారన్నది మార్కెట్ వర్గాల అంచనా. ఇప్పటికే.. ఎలక్ట్రికల్ కార్ల తయారీకీ అన్ని ప్రముఖ కార్ల కంపెనీలు నడుం బిగించాయి. మూడు చక్రాల ఆటో పరిశ్రమ ఇప్పటికే.. LPG , CNG గ్యాస్ వినియోగాన్ని ఆచరణలోకి తెచ్చింది. పొగ రహిత వాహనాల కోసం విద్యత్ శక్తితో నడిచే వాహానాల వైపే రానున్న రోజుల్లో అధిక డిమాండ్ ఎర్పడనుందని వాహన రంగంలోని ప్రముఖులు భావిస్తున్నారు.

Related image

అంతర్జాతీయంగా ముడి చమురు కొరత, దిగుమతులపై ఆంక్షలు ఇప్పటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడం ప్రారంభించాయి. ఇప్పటికే ..కొన్ని కంపెనీల మోడల్స్ రోడ్లమీద కనబడుతున్నాయి కూడా. ఒకసారి ఛార్జింగ్ చేస్తే.. 200 కిలో మీటర్ల వరకూ ప్రయాణించ వచ్చని మాన్యూఫాక్చరర్స్ తెలుపుతున్నారు. వీటి వాడకంలో కొన్ని ఇబ్బందులున్నప్పటికీ.. రానున్న రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాలకే ప్రాధాన్యం ఉండబోతున్నదని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఇప్పటికే.. పలు కార్ల కంపెనీలు , ఇంధన సంస్థలు రీఛార్జ్ యూనిట్లను దేశ వ్యాప్తంగా పెంచనున్నట్టు ప్రకటించాయి. హోండా, మారుతీ, ఫోర్డ్ , టాటా మోటార్స్ వంటి కంపెనీలు తమ మోడల్స్‌ను ఎలక్ట్రిక్ రీఛార్జ్‌కు ఉపయుక్తంగా తయారీకి సిద్ధం అయ్యాయి. ప్రస్తుతం దేశంలో B-6 కాలుష్య నిబంధనలు అమల్లో ఉన్నాయి. వీటి ప్రకారం గత 5 ఏళ్ళ క్రితం తయారైనా కార్లు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు మరో 18 ఏళ్ళలో రిటైర్ కావాల్సిందే. అంతకు మించి రోడ్ల మీద తిరిగితే.. కాలుష్య నిబంధనల ప్రకారం వాటిని సీజ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అందుకే పలు వాహన కంపెనీలు కాలుష్య రహిత , విద్యత్తుతో నడిచే వాహనాలనే ఇకపై మార్కెట్లలోకి తేవాలని భావిస్తున్నారు. డీజిల్ , పెట్రోల్ ఇంజిన్లు ఉన్న కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మార్చే ప్రయత్నాలు ఇప్పటికే చైనాలో ప్రారంభమయ్యాయి. అదే గనుక విజయవంతం అయితే.. అతి కొద్ది సంవత్సరాల్లోనే మనం  ద్రవ ఇంధన రహిత వాహనాలను మన దేశంలోనూ చూడొచ్చు..పూర్తి స్థాయిలో.

Image result for electric cars

ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ విద్యుత్ వాహనాల కోసం అమితాసక్తి చూపుతున్నారు వినియోగ దారులు.  విస్త్రతంగా విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లు ఉంటే.. ఎలక్ట్రిక్ వాహనాలవైపే కస్టమర్లు మొగ్గు చూపుతారని ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటర్స్ పేర్కొంది. ఆదిశగానే తాము ప్రయత్నాలు చేస్తున్నామని టాటా మోటర్స్ ఓ ప్రకటనల తెలిపింది. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు కూడా మరిన్ని నెలకొల్పాల్సి ఉందని.. గ్యాస్ ఆధారిత వాహనాల అమ్మకాలు కూడా ప్రధాన నగరాల్లో , పట్టణాల్లో పెరుగుతున్నాయని బజాజ్ ఆటో పేర్కొంది. 
కంప్రెస్డ్ బయో గ్యాస్:
వాహన కంపెనీలతో బాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. పెట్రోల్ డీజిల్ వినిమయం తగ్గించి కంప్రెస్డ్ బయో గ్యాస్‌ను అందుబాటులోకి తేవాలని ఆయిల్ కంపెనీలు భావిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సుమారు 5,000 బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సన్నాహకాలు మొదలయ్యాయని ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నాయి. బయో గ్యాస్ ప్లాంట్ల విషయంలో ప్రభుత్వ సబ్సీడీలు, సహకారం కూడా ఉంటుందని.. దీనిపై విస్తృత ప్రచారాన్ని నిర్వహించబోతున్నట్టు.. IOCL  కంపెనీ తెలిపింది. 

Image result for indian electric vehicles
డీజిల్ , పెట్రల్‌ విషయంలో ముడిచమురు ధరలు పెరిగితే.. దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల స్టాక్స్ విలువ పడిపోవడం మనం చూస్తునే ఉన్నాం. డాలర్‌తో  రూపీ విలువ రోజు రోజుకీ క్షీణిస్తుండటంతో ఆయిల్ కంపెనీల లాభాలు ఆవిరైపోతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయిల్ కంపెనీలు తమ వ్యాపారంలో కొత్త పోకడలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. విదేశాల నుండి ముడి చమురు దిగుమతుల కన్నా..దేశీయంగా విద్యుత్ ఛార్జింగ్ ప్లాంట్ల వ్యాపారం భవిష్యత్తులో పుంజుకుంటుందని అవి భావిస్తున్నాయి. ప్రభుత్వం కూడా వీటికి మద్దతు తెలుపుతూ.. ద్రవ ఇంధన రహిత వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో .. ఈ కంపెనీల భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోతుందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. మార్కెట్లలో ఎలక్ట్రిక్ బైక్‌లు అందుబాటులోకి వచ్చినా.. రీఛార్జ్ విషయంలో అవి సమస్యలు ఎదుర్కొడంతో విఫలమయ్యాయి. ఛార్జింగ్ పాయింట్లు విస్తారంగా లేక పోవడంతో .. ఇంటి వద్దనే ఫుల్ రీచార్జ్ చేసుకోవాల్సి వచ్చేది e-బైక్స్ వినియోగదారులకు. ఇలాంటి సమస్యలను అధిగమించి రాబోయే కాలంలో విద్యుత్ వాహనాలకు అగ్రపీఠం వేస్తామని కార్ల తయారీ సంస్థలు మాటిస్తున్నాయి. ఇదే నిజమైతే.. స్టాక్ మార్కెట్లలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, వాహన తయారీ కంపెనీల షేర్లు మరింత వృద్ధి చెందొచ్చని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. 
 Most Popular