కొత్త పెన్షన్ స్కీం (NPS) మరింత ఆకర్షణీయమా..?

కొత్త పెన్షన్ స్కీం (NPS) మరింత ఆకర్షణీయమా..?

ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన నేషనల్ పెన్షన్ స్కీం (NPS) కింద పెన్షన్ నిధిలో 60శాతం డ్రా చేసినా (60 ఏళ్ళు పైబడిన వారు )  ట్యాక్స్ విధించకపోవడం పట్ట సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పెన్షన్ నిధినుండి 60శాతం నగదు విత్‌డ్రా చేసుకున్నా దానిపై పన్ను లేక పోవడం పెన్షన్ దారులకు కలిసి వస్తుంది. గతంలో ఇది 40శాతంగా ఉండేది. దీర్ఘకాలికంగా నగదు అవసరం లేకుండా ఉన్నప్పుడే ఈ పెన్షన్ స్కీం ఉపయుక్తంగా ఉంటుందని పెన్షన్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఇతర మార్గాల్లో పొదుపు చేయనక్కర్లేకుండా.. ఉద్యోగ విరమణ నాటికి పూర్తి పెన్షన్ అందుకునే వారికి ఇది లాభదాయకంగా ఉంటుంది. ఈ నూతన విధానం EEE ( ఎక్సంప్షన్, ఎంట్రీ, మెచ్యూరిటీ) ఆధారంగా రూపొందించారు. ఈ విధానంలో ఎంప్లాయ్ ప్రావిడెండ్ ఫండ్ (EPF), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (PPF) రెండింటికీ వర్తిస్తుంది. మొత్తం నగదులో 60శాతం నగదుకు ట్యాక్స్ మినహాయింపు ఉండగా మిగిలిన 40శాతం మొత్తానికి అప్పటి స్లాబ్‌ రేట్ల ప్రకారం ట్యాక్స్ వర్తిస్తుంది. అత్యవసర సమయాల్లో ఒక ఉద్యోగి తన పెన్షన్ పథకం నుండి కేవలం 20 శాతం మాత్రమే పొందగలడు(ఉద్యోగంలో ఉన్నప్పుడు ) . పొదుపు విషయంలో ప్రావిడెంట్ ఫండ్ అనేది రిటైర్ మెంట్ తరువాత అవసరాలకోసమే ఉంచుకోవడం మంచిదని ఎనలిస్టులు సూచిస్తారు. ఉద్యోగ కాలంలో ఇతర అవసరాలు ఏవీ లేవు అనుకున్నప్పుడే.. పెన్షన్ నిధిని పెంచుకోడం మంచిది. నగదు అవసరాలు నిత్యం ఉంటే.. ఈ పెన్షన్ నిధిలో తక్కువ పెట్టుబడులు పెట్టుకోడం ఉత్తమమని., ఇతర మార్గాల్లో పొదుపు దైనందిన అవసరాలకు పనికొస్తుందని.. వారు అంటున్నారు.  NPS లో సాలీనా రూ. 50,000 మదుపు చేయగలిగితే.. 60 సంవత్సరాల తరువాత ట్యాక్స్ మినహాయింపు మనకు లాభంలా కనబడుతుంది. ఉద్యోగ కాలంలో మధ్యలో అవసరాలు ఉంటాయి అనుకున్నప్పుడు పెన్షన్ నిధిలో ఆదాయంలోని 30శాతానికి మించకుండా పొదుపు చేయడం ఉత్తమం. అదే .. ఇతర మార్గాల్లో ఆదాయం ఉన్నప్పుడు పెన్షన్ స్కీం లాభదాయకంగా కనబడుతుంది. ఉద్యోగ కాలంలో పెన్షన్ నిధి ఎప్పుడూ పూర్తిగా కాపాడదు. కాబట్టి ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టుకోడం, పొదుపు చేయడం తప్పనిసరి అని ఆర్ధిక విశ్లేషకులు అంటున్నారు. 
నేషనల్ పెన్షన్ స్కీంలో ఉన్న మరో లాభం ఎంటంటే.. ఫండ్ మేనేజ్ మెంట్ ఛార్జీలు అతి స్వల్పంగా ఉంటాయి. ఇతర మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులకు ఫండ్ నిర్వాహణా చార్జీల కింద 7 శాతం, లేదా 8 శాతం ఫీజును వసూలు చేస్తారు. కానీ.. NPS లో ఫండ్ నిర్వాహణ రుసుము.. కేవలం 0.01 శాతం మాత్రమే. ఇన్ కం ట్యాక్స్ సెక్షన్ 80CCD(1B)  కింద ఈ మినహాయింపు  వర్తిస్తుంది. అయితే.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు వారి రిటైర్‌మెంట్ లక్ష్యాలను చేరుకోడానికి అధిక మొత్తంలో ఈక్విటీలు అవసరం.  ఈ ప్రాతిపదికన NPSలో పెట్టుబడులు పూర్తి సురక్షితమే కదా. 


 Most Popular