గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ సుసి ఎంపిక చేసిన 2019 న్యూఇయర్ స్టాక్స్ ఇవే !

గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ సుసి ఎంపిక చేసిన 2019 న్యూఇయర్ స్టాక్స్ ఇవే !

గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ సుసి 2019 కొత్త సంవత్సరంలో  ఇండియన్ మార్కెట్స్ లో మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ను ఎంపిక చేసింది. ముఖ్యంగా క్రెడిట్ సుసి ఇండియన్ ఈక్విటీ మార్కెట్లపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. గడిచిన రెండు దశాబ్దాల్లో భారత్ లో సాధారణ ఎన్నికలు మార్కెట్ల దిశను పెద్దగా ప్రభావితం చేయలేదని తెలిపింది. 

అలాగే మార్కెట్ విపణిలోని వినియోగితను అనుసరించే కదులుతోందని, ముఖ్యంగా సెక్టార్ పరంగా ఉన్న ఎర్నింగ్స్ అంచనా నిష్పత్తి ఆధారంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. ప్రధానంగా ఇండస్ట్రియల్ స్టాక్స్ గడిచిన మూడు సంవత్సరాలుగా మార్కెట్లో భాగస్వామ్యం పంచుకోలేదని క్రెడిట్ సుసి తెలిపింది. అయితే రానున్న కాలంలో ఇండస్ట్రియల్ సెక్టార్ అలాగే కార్పోరేట్ ప్రైవేట్ బ్యాంక్స్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉందని తెలిపింది. 

క్రెడిట్ సుసి రికమండ్ చేసిన టాప్ 4 స్టాక్స్  ఇలా ఉన్నాయి.

ఎల్ అండ్ టీ : అవుట్ పెర్ఫార్మ్, టార్గెట్ రూ. 1700
దేశీయంగా రికవరీ బాట పట్టడం, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్, వేల్యూయేషన్స్, నిధుల ప్రవాహం కంపెనీ ఎర్నింగ్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే కంపెనీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రో పూర్తి స్థాయిలో రానున్న సంవత్సరం నుంచి పనిచేయడం వంటివి కంపెనీ కొత్త సంవత్సరంలో దూసుకెళ్లేందుకు దోహదపడనున్నాయి. 

భెల్ :  అవుట్ పెర్ఫార్మ్, టార్గెట్ రూ.100
విద్యుత్ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు. బలమైన ఆర్డర్ బుక్.  దేశంలో ఏటా పది గిగా వాట్స్ సామర్థ్యం పెరగడం కారణంగా చెప్పవచ్చు. ఎబిటా కూడా సంత్రుప్తికరంగా ఉంది. 

ఎస్‌బీఐ : అవుట్ పెర్ఫార్మ్, టార్గెట్ రూ. 350 
గత కొన్ని క్వార్టర్లుగా బ్యాంకు రుణవృద్దిలో మెరుగదల ఉంది. అలాగే ఎన్‌పీఏలు కూడా తగ్గుతున్నాయి. కొత్త సంవత్సరంలో మరింత బలంగా రికవరీ ఉండే అవకాశం ఉంది. వేల్యూయేషన్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉండటం కలిసి వచ్చే అంశం.

ఐసీఐసీఐ బ్యాంక్: అవుట్ పెర్ఫార్మ్, టార్గెట్ రూ.375
రాబోయే క్వార్టర్లలో ఎన్‌పీఏలు మరింత తగ్గే అవకాశం. రుణాల సంఖ్య కూడా పెరిగింది. బ్యాంక్ మూల ధనం కూడా పెరిగే అవకాశం ఉంది. 

దీంతో పాటు 2019 సంవత్సరంలో గ్లోబల్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉండే వీలుందని తెలిపింది. ముఖ్యంగా గ్లోబల్ గ్రోత్ లో కట్స్, అలాగే పలు సెంట్రల్ బ్యాంకుల మానిటరీ పాలసీలు కఠినంగా మారడం కారణంగా చెప్పింది. అయితే వీటి ప్రభావం నుంచి భారత ఈక్విటీ మార్కెట్లు తప్పించుకోలేవని తెలిపింది. అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్ల ప్రభావం పెద్దగా ఉండదని, విదేశీ మదుపరులు భారత్ పట్ల పాజిటివ్ గా ఉన్నట్లు తెలిపింది. Most Popular