బిట్ క్రాష్!!! 3 వేల డాలర్లకు బిట్ కాయిన్

బిట్ క్రాష్!!! 3 వేల డాలర్లకు బిట్ కాయిన్

ఊహాజనిత కరెన్సీ, లేదా డిజిటల్ కరెన్సీ అయిన బిట్ కాయిన్ ధర రాను రాను తగ్గి పోతూ వస్తుంది. గత శుక్రవారం గ్లోబల్ మార్కెట్లలో బిట్ కాయిన్ వాల్యూ 3,000 డాలర్లకు పడిపోయింది. 7వ వారం తిరోగమనంతో గత సెప్టెంబర్ నుండి అత్యంత గరిష్ట క్షీణతకు ఇది చేరింది.  న్యూయార్క్ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ఉదయం నాటికి  5.4 శాతం క్షీణతతో $3,270 వద్ద నమోదైంది. శుక్రవారం కంటే ముందు రోజు కూడ బిట్ కాయిన్ 3.5 శాతం క్షీణతను నమోదు చేసింది. శుక్రవారం న్యూయార్క్ మార్కెట్ క్లోజింగ్‌ కల్లా బిట్ కాయిన్ విలువ 3000 డాలర్లుగా ట్రేడ్ అయింది.
730 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి..!
కాయిన్ మార్కెట్ క్యాప్. కాం లెక్కల ప్రకారం గత జనవరి నుండి ఈ క్రిప్టో కరెన్సీస్  $730 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయాయి. వీటి విస్తారమైన నెట్ వర్గ్ , సంస్థాగత దత్తత వంటి అంశాలు కూడా బిట్ కాయిన్ విలువ పడిపోకుండా కాపాడలేక పోయాయి. ప్రధానంగా వీటిని పలు దేశాలు గుర్తించకపోవడం కూడా వీటి పతనానికి కారణమైంది. ప్రామాణిక భద్రత కొరవడటం, ఊహాజనిత కరెన్సీ అన్న వాదనలు ఎక్కువ కావడంతో క్రిప్టో కరెన్సీ విలువ పడిపోడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఈ డిసెంబర్‌లో రెండు మార్కెట్ విజయవంతమైన రోజుల్లో కూడా బిట్ కాయిన్ ర్యాలీ చేయడంలో విఫలమైంది. గ్లోబల్ మార్కెట్లలోని బుల్స్ కూడా బిట్ కాయిన్ ను సక్సెస్ ఫుల్ ఎంపికగా చూడలేదు. దాంతో బిట్ కాయిన్ విలువ క్రమంగా క్షీణించసాగింది. బిట్ కాయిన్ యొక్క ఎక్టివ్ వాలెట్ అడ్రెస్‌లకు ఫేయిర్ వాల్యూ $13,800-$14,800 మధ్యన ఉంటుందని, ఒకవేళ 7 శాతం ఉన్న  4.5 బిలియన్ల విసా కార్డ్ హోల్డర్స్ కు  గనుక ఈ బిట్ కాయిన్ వాలెట్లు చేరుకుంటే.. దాని విలువ $1,50,000 డాలర్లుగా ఉంటుందని ఫండ్ స్టార్ట్ గ్లోబల్ ఎడ్వైజర్స్ పేర్కొంది. చాలామంది ఇన్వెస్టర్లు ఈ బిట్ కాయిన్ విషయంలో టార్గెట్ ప్రైస్‌ను అడుగుతుంటారని, వీటి విలువ నిర్ధారిత ప్రామాణికాలు ఎమీ లేవు కాబట్టి వీటి టార్గెట్ ప్రైస్‌లను చెప్పలేక పోతున్నామని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు అంటున్నాయి. కానీ కొన్ని సంస్థలు మాత్రం బిట్ కాయిన్ విషయంలో అందోళనలను అవసరం లేదని.. రానున్న సంవత్సరం చివరినాటికి బిట్ కాయిన్ విలువ $15,000 డాలర్లకు చేరొచ్చని చెబుతున్నాయి.
బిట్ కాయిన్లను అంగీకరించని దేశాలు:
ఈ ఊహాజనిత కరెన్సీలను కొన్ని దేశాలు అంగీకరించడంలేదు. బిట్ కాయిన్లను గుర్తించని దేశాల్లో భారత్, చైనా వంటి అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థలు కూడా ఉండటం విశేషం. కాగా బిట్ కాయిన్ విషయంలో చైనా గుర్తింపు విషయంలో ఒక కమీటీని కూడా వేసింది.
 Most Popular