మీ బ్యాంక్ చెక్ బుక్స్‌ను మార్చుకోండి ఈ డిసెంబర్ 31 కల్లా..!

మీ బ్యాంక్ చెక్ బుక్స్‌ను మార్చుకోండి ఈ డిసెంబర్ 31 కల్లా..!

మీ బ్యాంకు చెక్కులు ఈ డిసెంబర్ 30 వరకే చెల్లుబాటు అవుతాయి. జనవరి 1 నుండి ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకుల  MICR కోడ్లు మారబోతున్నాయి.  బ్యాంకు శాఖల కోడింగ్ మారడంతో ఆయా చెక్ బుక్కుల మీద MICR కోడ్ తేడా వస్తుంది. జనవరి 1 నుండి పాత చెక్కులు మారబోవని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.

రక్షిత బ్యాంకింగ్ విధానాలు, నెట్ బ్యాంకింగ్‌లలో మోసాలకు అడ్డుకట్ట వేసే పనుల్లో భాగంగానే ఆర్బీఐ ఈ MICR కోడ్లను మార్చబోతుంది. ప్రతి బ్యాంకు తమ వినియోగదారులకు సంక్షిప్త సందేశాల ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. వినియోగ దారులు పాత చెక్కు బుక్కుల స్థానంలో కొత్త MICR కోడ్ ఉన్న చెక్ బుక్కులను బ్యాంకు శాఖల వద్ద మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు తమ వినియోగదారులకు ఈ మెసెజ్‌ను పంపిస్తున్నాయని, మరి కొన్ని బ్యాంకులు ప్రకటనల రూపంలో తెలియపరుస్తున్నాయని సమాచారం.
 Most Popular