మార్కెట్‌ నష్టాలతో- రియల్టీ లాభాలలో

మార్కెట్‌ నష్టాలతో- రియల్టీ లాభాలలో

నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి ప్రవేశించిన దేశీ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 62 పాయింట్ల వెనకడుగుతో 35,867కు చేరింది. నిఫ్టీ 23 పాయింట్లు క్షీణించి 10,769వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్ల వీక్‌నెస్‌ నేపథ్యంలో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య సాగుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 100 పాయింట్లకుపైగా తిరోగమించిన సెన్సెక్స్‌ తదుపరి కోలుకుని లాభాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. కాగా.. గురువారం అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగియగా.. ప్రస్తుతం ఆసియాలో అన్ని మార్కెట్లూ నష్టాలతో ట్రేడవుతున్నాయి. 

ఎయిర్‌టెల్‌ జోరు..
ఎన్‌ఎస్ఈలో ప్రధానంగా రియల్టీ 0.6 శాతం పుంజుకోగా.. ఫార్మా 0.6 శాతం క్షీణించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్‌టెల్‌ దాదాపు 6 శాతం జంప్‌చేయగా.. ఐవోసీ, గ్రాసిమ్, ఏషియన్‌ పెయింట్స్‌, బీపీసీఎల్‌, ఐబీ హౌసింగ్‌, యస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌, హెచ్‌పీసీఎల్‌, ఇన్ఫోసిస్‌ 3.3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, బజాజ్‌ ఆటో, టైటన్‌, యూపీఎల్‌, జీ, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, కోల్‌ ఇండియా 2.5-1 శాతం మధ్య నష్టపోయాయి. రియల్టీ స్టాక్స్‌లో ఇండియాబుల్స్‌, శోభా, ఒబెరాయ్‌, ప్రెస్టేజ్‌, ఫీనిక్స్‌ 3-0.5 శాతం మధ్య ఎగశాయి.

Image result for airtel
 
పీసీ జ్యువెలర్స్‌ మెరుపు
డెరివేటివ్స్‌లో సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, అరబిందో, టొరంట్‌ పవర్‌, కావేరీ సీడ్‌, బీఈఎల్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, హింద్‌ జింక్, ఉజ్జీవన్‌, దివీస్‌ లేబ్‌ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు పీసీ జ్యువెలర్స్‌ 10 శాతం దూసుకెళ్లగా, పీఎఫ్‌సీ, ఐడియా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, మదర్‌సన్, కేన్‌ఫిన్‌, ఆర్‌ఈసీ, సుజ్లాన్‌ 7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. 

చిన్న షేర్లు ఫ్లాట్‌
మార్కెట్ల బాటలో చిన్న షేర్లలోనూ ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. దీంతో బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ మాత్రమే 0.3 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1027 లాభపడగా.. 1098 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఫోర్టిస్‌, జైన్‌ ఇరిగేషన్, సర్లా పాలీ, అయాన్‌ ఎక్స్ఛేంజ్‌, ఐఎస్‌ఎఫ్‌టీ, బీఆర్‌ఎఫ్‌ఎల్‌, ఐఎల్‌అండ్‌ ట్రాన్స్‌, ఆర్‌పీపీ ఇన్‌ఫ్రా, జేపీ ఇన్‌ఫ్రా, ఏఎస్‌ఎల్‌, షెమారూ, సంఘ్వీ మూవర్స్ తదితరాలు  6.5-3.5 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular