ఐపీవోలోకి త్వరలో పతంజలి !

ఐపీవోలోకి త్వరలో పతంజలి !

ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో దూసుకుపోతున్న ఆయుర్వేదిక్‌ దిగ్గజం పతంజలి ఐపీవోకు రానున్నట్లు సంకేతాలు ఇస్తోంది. ఇదే విషయాన్ని ప్రముఖ యోగా గురు రాందేవ్‌ బాబా తెలిపారు. దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేస్తూ త్వరలోనే ఆ ఆలోచన చేస్తున్నామని తెలిపారు. కేవలం ఆయుర్వేదిక్‌ ఉత్పత్తుల అమ్మకాల స్థాయి నుంచి నేడు ఎఫ్‌ఎంసీజీ రంగంలోని దిగ్గజాలకు సైతం సవాలు విసురుతున్న పతంజలి సంస్థ దేశంలో అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలకు విస్తరించింది. 

రాబోయే 5ఏళ్లలో రూ.20 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌ లక్ష్యంగా పతంజలి పావులు కదుపుతోంది. 2012లో రూ.500 కోట్ల టర్నోవర్‌ కలిగిన పతంజలి.. 2016 నాటికి రూ.10వేల కోట్లకు చేరింది. అయితే జీఎస్టీ కారణంగా మార్చి 2018నాటికి పతంజలి ఆదాయం 10 శాతం కోత పడి రూ. 8 వేల కోట్లుగా నమోదు చేసుకుంది. Most Popular