జూబిలెంట్ ఫుడ్‌, ఎన్‌బీసీసీ ప్లస్‌లో

జూబిలెంట్ ఫుడ్‌, ఎన్‌బీసీసీ ప్లస్‌లో

భాగస్వామ్య సంస్థ(జేవీ)లో వాటాను పెంచుకున్నట్లు వెల్లడించడంతో డోమినోస్‌ పిజ్లా స్టోర్ల నిర్వాహక సంస్థ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ సంస్థ ఎన్‌బీసీసీ లిమిటెడ్‌ గత రెండు నెలల్లో సాధించిన కాంట్రాక్టుల వివరాలు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ రెండు కౌంటర్లలోనూ కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో ఇవి కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌
బంగ్లాదేశ్‌ జేవీ జూబిలెంట్‌ గోల్డెన్‌ హార్వెస్ట్‌లో ఈక్విటీ షేర్లను సొంతం చేసుకోవడం ద్వారా వాటాను పెంచుకున్నట్లు జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ తాజాగా పేర్కొంది. 51 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా జేవీలో వాటాను 51 శాతానికి పెంచుకున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 3.4 శాతం ఎగసి రూ. 1274 వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు 44.94 శాతం వాటా ఉంది. కంపెనీ నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకలోనూ డోమినోస్‌ పిజ్జా స్టోర్లను నిర్వహిస్తొంది.

Image result for NBCC Ltd

ఎన్‌బీసీసీ లిమిటెడ్‌
అక్టోబర్‌లో సాధించిన రూ. 1854 కోట్ల కాంట్రాక్టులకు జతగా నవంబర్‌లోనూ రూ. 743 కోట్లకుపైగా విలువైన ఆర్డర్లు పొందినట్లు పీఎస్‌యూ దిగ్గజం ఎన్‌బీసీసీ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌వైపు ఇన్వెస్టర్లు దృష్టిసారించారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3 శాతం పెరిగి రూ. 53.6 వద్ద కదులుతోంది. ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సర్వీసులు అందించే కంపెనీలో ప్రమోటర్ కేంద్ర ప్రభుత్వానికి 73.75 శాతం వాటా ఉంది. Most Popular