మార్కెట్లకు వాణిజ్య వివాదాల వణుకు

మార్కెట్లకు వాణిజ్య వివాదాల వణుకు

చైనీస్‌ టెక్‌ దిగ్గజం హువావే సీఎఫ్‌వో మెంగ్‌ వాన్‌జూను కెనడియన్‌ అధికారులు అరెస్ట్‌ చేసినట్లు వెల్లడికావడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాక్‌ తగిలింది. యూఎస్‌కు ఆమెను అప్పగించనున్నట్లు  కెనడియన్‌ న్యాయ శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో ఇప్పటికే అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య విభేధాలు మరింత ముదిరే అవకాశమున్నట్లు ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. అంతర్జాతీయంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఈ రెండు దేశాల మధ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించనున్న అంచనాలు బలపడుతున్న నేపథ్యంలో తాజా వివాదం ఇన్వెస్టర్లలో వణుకు పుట్టిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా యూఎస్‌ ఫ్యూచర్స్‌ నీరసించగా.. ఆసియా, యూరప్‌ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ బాటలో దేశీయంగానూ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 600 పాయింట్లకుపైగా పడిపోయింది. చివరికి సెన్సెక్స్‌ 572 పాయింట్లు పతనమై 35,312 వద్ద నిలవగా.. నిఫ్టీ 182 పాయింట్లు పోగొట్టుకుని 10,601 వద్ద స్థిరపడింది.

Image result for huawei technologies co. ltd

2 షేర్లు మాత్రమే 
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. రియల్టీ, ఆటో, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్స్‌ 2.4-1.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌ 6 శాతం పతనంకాగా.. మారుతీ, బజాజ్‌ ఫిన్‌, టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, గ్రాసిమ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఆర్‌ఐఎల్‌, అదానీ పోర్ట్స్‌, యస్‌ బ్యాంక్‌ 5-3 శాతం మధ్య తిరోగమించాయి. బ్లూచిప్స్‌లో సన్‌ ఫార్మా(1 శాతం), జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌(0.5 శాతం) మాత్రమే బలపడ్డాయి.  

Image result for bp monitoring

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు పతనబాటలో సాగిన నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.5 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1797 నష్టపోగా.. 746 మాత్రమే లాభాలతో ముగిశాయి. 

అమ్మకాల జోరు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 358 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 791 కోట్లు చొప్పున  పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 56 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 521 కోట్లు విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే. Most Popular