అరబిందో ఫార్మాపై లా సూట్‌?!

అరబిందో ఫార్మాపై లా సూట్‌?!

అమెరికాలో కంపెనీకి వ్యతిరేకంగా కేసు నమోదైందన్న వార్తలు హైదరాబాద్‌ ఫార్మా సంస్థ అరబిందో కౌంటర్లో భారీ అమ్మకాలకు తెరతీసింది. ప్రమాణాలకు అనుగుణంగాలేని ఇర్బెసర్టన్‌ ఏపీఐను సరఫరా చేస్తున్నట్లు అరబిందో ఫార్మాపై అమెరికాలో క్లాస్‌ యాక్షన్‌ లాసూట్‌ నమోదైనట్లు వెలువడ్డ వార్తలు ఈ కౌంటర్లో అమ్మకాలకు కారణమవుతున్నాయి. హై బీపీ చికిత్సకు వినియోగించే ఔషధ తయారీలో వాడే ఇర్బెసర్టన్‌ ఏపీఐ నాణ్యత సరిగాలేదని ఆరోపిస్తూ అరబిందోపై కేసు నమోదైనట్లు మీడియా పేర్కొంది. 

Image result for Aurobindo pharma
షేరు డౌన్‌
బీపీ తగ్గించే ఔషధాల తయారీలో ఇర్బెసర్టన్‌ ఏపీఐను వినియోగిస్తారు. నాణ్యతలేని ఇర్బెసర్టన్‌ ఏపీఐ సరఫరాల అంశంపై ఫ్లోరిడా ఫెడరల్‌ కోర్టులో అరబిందో ఫార్మాపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అరబిందోతోపాటు.. స్థానిక కంపెనీ సైజెన్‌ ఫార్మాస్యూటికల్స్‌, ఇతర పంపిణీ, రిటైల్‌ సంస్థలపైనా కేసు నమోదైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అరబిందో కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 4.6 శాతం పతనమై రూ. 760 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 752 వరకూ నీరసించింది. రూ. 795 వద్ద గరిష్టాన్నీ తాకింది. కాగా.. ఇర్బెసర్టన్‌ ఏపీఐ సరఫరాల అంశంపై లా సూట్‌ దాఖలైనట్లు ఎలాంటి సమాచారం తమకు అందలేదని అరబిందో తాజాగా వివరణ ఇచ్చింది.Most Popular