యూరప్‌ దిగాలు- సెన్సెక్స్‌ కుదేల్‌

యూరప్‌ దిగాలు- సెన్సెక్స్‌ కుదేల్‌

చైనీస్‌ టెక్‌ దిగ్గజం హువావే సీఎఫ్‌వోను అమెరికా అభ్యర్ధన మేరకు కెనడియన్‌ అధికారులు అరెస్ట్‌ చేసినట్లు వెల్లడికావడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో అమెరికా, చైనా మధ్య తిరిగి వాణిజ్య వివాదాలు చెలరేగనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారితీశాయి. ఫలితంగా ఇప్పటికే ఆసియా మార్కెట్లు పతనంకాగా.. యూరోప్‌లోనూ అన్ని మార్కెట్లూ బలహీనంగా ప్రారంభమయ్యాయి. యూకే 1.2 శాతం నీరసించగా.. ఫ్రాన్స్‌ 1.5 శాతం, జర్మనీ 1.7 శాతం చొప్పున తిరోగమించాయి. ఆసియా మార్కెట్లు 2.5-0.6 శాతం మధ్య క్షీణించాయి. ఈ నేపథ్యంలో నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం నష్టాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 424 పాయింట్లు పతనమై 35,460కు చేరింది. నిఫ్టీ సైతం 141 పాయింట్లు కోల్పోయి 10,642 వద్ద ట్రేడవుతోంది.

రియల్టీ, ఐటీ, ఆటో, బ్యాంక్స్‌ డీలా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ వెనకడుగు వేశాయి. ప్రధానంగా రియల్టీ, ఐటీ, ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ, ఫార్మా 2.6-1.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌ 5.4 శాతం పతనంకాగా.. టెక్‌ మహీంద్రా, మారుతీ, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, గ్రాసిమ్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్, ఏషియన్‌ పెయింట్స్‌, యస్‌ బ్యాంక్‌ 4.4-2.3 శాతం మధ్య పతనమయ్యాయి. బ్లూచిప్స్‌లో సన్‌ ఫార్మా 2.4 శాతం జంప్‌చేయగా.. బజాజ్‌ ఆటో, యూపీఎల్‌, పవర్‌గ్రిడ్‌ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 0.5 శాతం పుంజుకున్నాయి. 

Image result for share trading india
 
ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎన్‌సీసీ 7 శాతం కుప్పకూలగా.. అదానీ పవర్‌, పీసీ జ్యువెలర్స్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, సీజీ పవర్‌, సెంచురీ టెక్స్‌టైల్స్‌, అరబిందో ఫార్మా 6-4.4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క సీమెన్స్‌, సన్‌ టీవీ, యూబీఎల్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, పీటీసీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌, చెన్నై పెట్రో, మదర్‌సన్‌, బాష్‌ 3.7-1.3 శాతం మధ్య బలపడ్డాయి. రియల్టీ స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌, యూనిటెక్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌, బ్రిగేడ్‌, శోభా, ఒబెరాయ్‌ 4.3-0.7 శాతం మధ్య తిరోగమించాయి.

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమైన నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.5 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1690 నష్టపోగా.. 663 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. 



Most Popular