రియల్టీ, బ్యాంక్‌, ఫార్మా షేర్లు వీక్‌

రియల్టీ, బ్యాంక్‌, ఫార్మా షేర్లు వీక్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన పరపతి సమీక్ష చేపట్టిన మానిటరీ పాలసీ కమిటీ యథాతథ విధానాల అమలుకే నిర్ణయించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో 6.5 శాతం వద్ద, రివర్స్‌ రెపో 6.25 శాతం వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల ప్రభావిత బ్యాంకింగ్, రియల్టీ కౌంటర్లలో అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ ఇండెక్స్‌ 3 శాతం నీరసించగా.. ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగ బ్యాంక్స్‌తో కూడిన బ్యాంక్ నిఫ్టీ 1.25 శాతం తిరోగమించింది. బుధవారం సైతం ఈ రెండు రంగాలు 0.7 శాతం చొప్పున బలహీనపడిన సంగతి తెలిసిందే. కాగా.. మరోపక్క మార్కెట్లు పతనబాటలో సాగుతుండటంతో ఫార్మా కౌంటర్లు సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

Image result for shares down

నేలచూపుతో
రియల్టీ కౌంటర్లలో డీఎల్‌ఎఫ్‌, యూనిటెక్, ఇండియాబుల్స్‌, గోద్రెజ్ ప్రాపర్టీస్‌, బ్రిగేడ్‌, ప్రెస్టేజ్‌, శోభా, ఒబెరాయ్‌ 6-1.5 శాతం మధ్య పతనమయ్యాయి. ఇక బ్యాంక్‌ నిఫ్టీలో పీఎన్‌బీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్, బీవోబీ, యాక్సిస్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ 4-1.5 శాతం మధ్య నష్టపోయాయి. ఇక ఫార్మా షేర్లలో అరబిందో 5 శాతం పతనంకాగా.. బయోకాన్‌, పిరమల్‌, సిప్లా, కేడిలా, డాక్టర్‌ రెడ్డీస్‌, దివీస్‌ లేబ్‌, గ్లెన్‌మార్క్‌, లుపిన్‌ 3-1 శాతం మధ్య క్షీణించాయి. Most Popular