మారుతీ, దిలీప్‌ బిల్డ్‌కాన్‌ రివర్స్‌ గేర్‌

మారుతీ, దిలీప్‌ బిల్డ్‌కాన్‌ రివర్స్‌ గేర్‌

నవంబర్‌లో వాహన ఉత్పత్తి క్షీణించినట్లు వెల్లడించడంతో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం జరిమానా విధించిన వార్తలు మౌలిక సదుపాయాల సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ కౌంటర్‌నూ బలహీనపరుస్తోంది. ఇన్వెస్టర్లు ఈ రెండు కౌంటర్లలోనూ అమ్మకాలకే మొగ్గుచూపుతున్నారు. ఇతర వివరాలు ఇలా..

మారుతీ సుజుకీ
నవంబర్‌లో వాహనాల ఉత్పత్తి దాదాపు 13 శాతం క్షీణించి 135946 యూనిట్లకు పరిమితమైనట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. 2017 నవంబర్‌లో 155568 వాహనాలను రూపొందించినట్లు తెలియజేసింది. దీంతో వరుసగా రెండో రోజు మారుతీ కౌంటర్లో అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు దాదాపు 3 శాతం పతనమై రూ. 7345 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 7325 వరకూ నీరసించింది. కాగా జనవరి 2019 నుంచీ కొన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే కంపెనీ ప్రకటించింది. కమోడిటీ ధరల పెరుగుదల, ఫారెక్స్‌ రేట్ల హెచ్చుతగ్గులు ప్రభావం కారణంగా ధరలు పెంచుతున్నట్లు తెలియజేసింది. 

Image result for Dilip Buildcon Limited

దిలీప్‌ బిల్డ్‌కాన్‌
బీడ్‌ జిల్లాలో సాఫ్ట్‌రాక్‌(మురుమ్‌)ను అక్రమంగా తొలచిన కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 34 కోట్ల జరిమానాను విధించినట్లు వెలువడ్డ వార్తలు దిలీప్‌ బిల్డ్‌కాన్‌ కౌంటర్‌లో అమ్మకాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.3 శాతం క్షీణించి రూ. 432 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 429 వరకూ నీరసించింది. మజల్‌గావ్‌- కేజ్‌ రోడ్‌ నిర్మాణంలో భాగంగా కంపెనీ అక్రమ ఎక్స్‌కవేషన్‌ పనులను చేపట్టిన కారణంగా మహారాష్ట్ర అధికారిక సంస్థ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. దిలీప్‌ బిల్డ్‌కాన్‌లో ప్రమోటర్లకు 75.63 శాతం వాటా ఉంది. Most Popular