ప్లస్‌లో సొనాటా సాఫ్ట్‌, సాగర్‌ సిమెంట్స్‌

ప్లస్‌లో సొనాటా సాఫ్ట్‌, సాగర్‌ సిమెంట్స్‌

విదేశీ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో ఐటీ సేవల మధ్యస్థాయి సంస్థ సొనాటా సాఫ్ట్‌వేర్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. మరోపక్క కొత్త ప్లాంట్ల ఏర్పాటు ద్వారా కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన హైదరాబాద్‌ సంస్థ సాగర్‌ సిమెంట్స్‌ కౌంటర్‌ సైతం నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..

సొనాటా సాఫ్ట్‌వేర్‌
ఆస్ట్రేలియన్‌ కంపెనీ స్కాలబుల్‌ డేటా సిస్టమ్స్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సొనాటా సాఫ్ట్‌వేర్‌ తాజాగా వెల్లడించింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 2.2 శాతం పెరిగి రూ. 305 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 309 వరకూ ఎగసింది. స్కాలబుల్‌ కొనుగోలు ద్వారా మైక్రోసాఫ్ట్‌ డైనమిక్స్‌ 365లోనూ కార్యకలాపాలు విస్తరించగలదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా సంయుక్త సంస్థ రిటైల్‌, పంపిణీ, తయారీ తదితర విభాగాలలో డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సేవలు విస్తరించగలదని తెలియజేశారు. సొనాటా సాఫ్ట్‌వేర్‌లో ప్రమోటర్లకు 30.95 శాతం వాటా ఉంది. 

Image result for sagar cements

సాగర్‌ సిమెంట్స్‌
మధ్యప్రదేశ్‌లోని సద్గురు సిమెంట్‌ ప్రయివేట్‌లో రూ. 150 కోట్లు ఇన్వెస్ట్‌చేసేందుకు బోర్డు అనుమతించినట్లు సాగర్‌ సిమెంట్స్‌ వెల్లడించింది. దీంతో 1 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంటును ఏర్పాటు చేయనుంది. హీట్‌ రికవరీ పవర్‌ప్లాంటును సైతం నెలకొల్పనుంది. ఇందుకు మొత్తం రూ. 426 కోట్లవరకూ వెచ్చించనుంది. ఇదే విధంగా ఒడిషాలోని జైపూర్‌లోగల జైపూర్‌ సిమెంట్స్‌లో రూ. 108 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. 1.5 మిలియన్‌ టన్నుల గ్రైండింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దశలవారీగా మొత్తం రూ. 308 కోట్లు వెచ్చించనుంది. 2021కల్లా రెండు ప్లాంట్ల నిర్మాణాలు పూర్తిచేయాలని భావిస్తున్నట్లు సాగర్‌ సిమెంట్స్‌ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 3 శాతం పెరిగి రూ. 690 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 695 వరకూ ఎగసింది.Most Popular