విదేశీ షాక్‌- నష్టాలతో షురూ

విదేశీ షాక్‌- నష్టాలతో షురూ

చైనీస్‌ టెక్‌ దిగ్గజం హువే డిప్యూటీ చైర్మన్‌ను అమెరికాకు అప్పగించేందుకు కెనడియన్‌ అధికారులు అరెస్ట్‌ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో అమెరికా, చైనా మధ్య తిరిగి వాణిజ్య వివాదాలు చెలరేగనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారితీశాయి. ఫలితంగా ఆసియాలో అమ్మకాలు ఊపందుకున్నాయి. అన్ని మార్కెట్లూ పతనబాటలో పయనిస్తున్నాయి. వెరసి దేశీయంగానూ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 280 పాయింట్లు పతనమై 35,604కు చేరింది. నిఫ్టీ సైతం 94 పాయింట్లు క్షీణించి 10,689 వద్ద ట్రేడవుతోంది.

మెటల్‌, ఆటో వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ వెనకడుగు వేశాయి. ప్రధానంగా మెటల్‌, ఆటో, రియల్టీ 1.5 శాతం స్థాయిలో నీరసించాయి. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్‌ నిఫ్టీ సైతం 1 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, ఐషర్‌, హిందాల్కో, యస్‌ బ్యాంక్‌, ఐవోసీ, ఎయిర్‌టెల్‌, బీ హౌసింగ్‌, ఇండస్‌ఇండ్ 3-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బ్లూచిప్స్‌లో కేవలం సన్‌ ఫార్మా, పవర్‌గ్రిడ్‌, యూపీఎల్‌ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 2-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. 

Image result for world stocks down
 
ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎన్‌సీసీ, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, బీఈఎంఎల్‌, వోల్టాస్‌, అరబిందో, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఇన్ఫీబీమ్‌ 4.3-2.75 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క మైండ్‌ట్రీ, టాటా కెమికల్స్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ 3.3-0.4 శాతం మధ్య బలపడ్డాయి. రియల్టీ స్టాక్స్‌లో ప్రెస్టేజ్‌, ఒబెరాయ్‌, డీఎల్‌ఎఫ్‌, ఇండియాబుల్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, శోభా, సన్‌టెక్ 3-0.7 శాతం మధ్య తిరోగమించాయి.

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమైన నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతం స్థాయిలో నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 860 నష్టపోగా.. 301 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. 



Most Popular