మళ్లీ గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌?!

మళ్లీ గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు మరోసారి నష్టాల(గ్యాప్‌డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 85 పాయింట్లు పతనమై 10,748 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఇన్వెస్టర్లలో పెరిగిన ఆందోళనలు అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. గత శుక్రవారం దివంగతులైన సీనియర్‌ బుష్‌కు నివాళిగా బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. కాగా.. మంగళవారం అమెరికా స్టాక్‌ ఇండెక్సులు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార చర్చలు మొదలుకానున్నప్పటికీ  రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరే అంశంపై సందేహాలు తలెత్తడం కూడా ఆందోళనలు పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా బుధవారం యూరోపియన్‌ మార్కెట్లు నష్టపోగా.. ప్రస్తుతం ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది.

నష్టాలలోనే
విదేశీ మార్కెట్ల పతనానికితోడు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన సమావేశమైన ఎంపీసీ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలి నుంచీ అమ్మకాల ఒత్తిడిలోనే కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలతోనే ముగిశాయి. బుధవారం సెన్సెక్స్‌ 250 పాయింట్లు క్షీణించి 35,884 వద్ద నిలిచింది. తద్వారా 36,000 పాయింట్ల మైలురాయి దిగువన ముగిసింది. నిఫ్టీ సైతం 87 పాయింట్ల వెనకడుగుతో 10,783 వద్ద స్థిరపడింది. 

Image result for share investors india

నిఫ్టీ అంచనాలు ఇలా?
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,747 పాయింట్ల వద్ద, తదుపరి 10,711 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 10,820 పాయింట్ల వద్ద, తదుపరి 10,857 స్థాయిలోనూ అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీ తొలుత 26433 వద్ద తదుపరి 26347 వద్ద మద్దతు కూడగట్టుకోవచ్చని.. ఇదే విధంగా 26617 వద్ద 26,714 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు.

అమ్మకాల జోరు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 358 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 791 కోట్లు చొప్పున  పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 56 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 521 కోట్లు విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే. Most Popular