ప్రపంచ మార్కెట్లూ, ఆర్‌బీఐ ఎఫెక్ట్‌!

ప్రపంచ మార్కెట్లూ, ఆర్‌బీఐ ఎఫెక్ట్‌!

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించనున్న అంచనాలు అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లను ఆందోళనలకు లోనుచేశాయి. దీంతో మంగళవారం అమెరికా మార్కెట్లు 3 శాతంపైగా కుప్పకూలగా.. ఆసియా, యూరోపియన్‌ మార్కెట్లు సైతం 1-2 శాతం మధ్య క్షీణించాయి. దీంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడింది. మరోవైపు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన సమావేశమైన ఎంపీసీ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలి నుంచీ అమ్మకాల ఒత్తిడిలోనే కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 250 పాయింట్లు క్షీణించి 35,884 వద్ద నిలిచింది. తద్వారా 36,000 పాయింట్ల మైలురాయి దిగువన ముగిసింది. నిఫ్టీ సైతం 87 పాయింట్ల వెనకడుగుతో 10,783 వద్ద స్థిరపడింది. 

Image result for stock investors india

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, ఫార్మా, ఆటో 3.7-2.3 శాతం మధ్య నీరసించాయి. వడ్డీ రేట్ల ప్రభావిత ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, బ్యాంక్‌ నిఫ్టీ సైతం 0.7 శాతం చొప్పున డీలాపడ్డాయి. ఐటీ ఇండెక్స్‌ మాత్రమే నష్టపోకుండా నిలదొక్కుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో సన్‌ ఫార్మా 6 శాతం పతనంకాగా.. హిందాల్కో, టాటా స్టీల్‌, ఐబీ హౌసింగ్‌, వేదాంతా, టాటా మోటార్స్‌, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎంఅండ్‌ఎం, కోల్‌ ఇండియా 5-3 శాతం మధ్య తిరోగమించాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్‌ప్రాటెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఆర్‌ఐఎల్‌ 2.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి.

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నేలచూపులకే పరిమితమైన నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.25 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1770 నష్టపోగా.. 800 మాత్రమే లాభాలతో నిలిచాయి. 

రెండు వైపులా అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 56 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 521 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 293 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 806 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే. Most Popular