సీన్సిస్‌ టెక్‌ జూమ్‌- ఆర్‌ఈసీ క్యూ2

సీన్సిస్‌ టెక్‌ జూమ్‌- ఆర్‌ఈసీ క్యూ2

స్మార్ట్‌ సిటీ పనుల కోసం కాంట్రాక్టు లభించినట్లు వెల్లడించడంతో సీన్సిస్‌ టెక్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు నష్టాల మార్కెట్లోనూ డిమాండ్‌ కనిపిస్తోంది. మరోపక్క విద్యుత్‌ రంగ ప్రభుత్వ దిగ్గజం రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌(ఆర్‌ఈసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. వివరాలు చూద్దాం..

సీన్సిస్‌ టెక్‌
గతంలో ఏడీసీసీ ఇన్ఫోక్యాడ్‌గా లిస్టయిన సీన్సిస్‌ టెక్‌ లిమిటెడ్‌ తాజాగా రూ. 121 కోట్ల విలువైన స్టార్ట్‌ సిటీ పనుల కాంట్రాక్ట్ లభించినట్లు పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో కొనుగోళ్లకు క్యూకట్టారు. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 94.50 వద్ద ఫ్రీజయ్యింది. స్మార్ట్‌ సిటీ కాంట్రాక్టులో భాగంగా థానే పట్టణానికి స్మార్ట్‌ వాటర్‌ మీటర్ల సరఫరా, సంబంధిత మౌలిక సదుపాయాల ఏర్పాట్లను చేపట్టాల్సి ఉంటుందని సీన్సిస్‌ టెక్‌ తెలియజేసింది. ఇంజినీరింగ్‌, జియోస్పేటియల్‌ తదితర సర్వీసులందించే సీన్సిస్‌ టెక్‌లో ప్రమోటర్లకు 56.73 శాతం వాటా ఉంది. 

Related image

ఆర్‌ఈసీ
విద్యుత్‌ రంగ ప్రభుత్వ దిగ్గజం రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌(ఆర్‌ఈసీ) ఈ ఏడాది క్యూ2 ఫలితాలు ప్రకటించింది. జులై-సెప్టెంబర్‌ కాలంలో నికర లాభం రూ. 1408 కోట్ల నుంచి రూ. 1764 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం సైతం రూ. 5602 కోట్ల నుంచి రూ. 7286 కోట్లకు ఎగసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్ఈలో ఆర్‌ఈసీ షేరు ప్రస్తుతం 1 శాతం నష్టంతో రూ. 106 దిగువన ట్రేడవుతోంది. Most Popular