మార్కెట్లకు ఆర్‌బీఐ- యూరోప్‌ షాక్‌

మార్కెట్లకు ఆర్‌బీఐ- యూరోప్‌ షాక్‌

దేశ జీడీపీ పురోగతి తదితర అంశాలపై దృష్టిపెట్టిన ఎంపీసీ యథాతథ పాలసీకే ఓటు వేసింది. ఆర్‌బీఐ గవర్నర్‌ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించేందుకు తాజాగా నిర్ణయించింది. మరోపక్క ప్రపంచ ఆర్థిక మందగమనంపై ఇన్వెస్టర్లలో తలెత్తిన ఆందోళనలు యూరోపియన్‌ స్టాక్ మార్కెట్లనూ దెబ్బతీశాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 312 పాయింట్లు పతనమై 35,821కు చేరగా.. నిఫ్టీ 107 పాయింట్లు తిరోగమించి 10,762ను తాకింది. ఇక యూరోపియన్‌ మార్కెట్లలో యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌ 1 శాతం చొప్పున పతనమయ్యాయి.

Related image

సెయింట్‌ గొబైన్‌ డీలా
వాణిజ్య వివాదాల నేపథ్యంలో జేపీ మోర్గాన్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ఫ్రాన్స్‌ సంస్థ సెయింట్‌ గొబైన్‌ 3 శాతం క్షీణించింది. మోర్గాన్‌ స్టాన్లీ రేటింగ్‌ను తగ్గించడంతో బ్రిటిష్‌ సంస్థ హర్‌గ్రీవ్స్ లాన్స్‌డౌన్‌ 5 శాతం పతనమైంది. కాగా.. జపనీస్‌ దిగ్గజం టకెడా ఫార్మా 60 బిలియన్‌ డాలర్లతో టేకోవర్‌ చేయనున్న వార్తలతో బ్రిటిష్‌ హెల్త్‌కేర్‌ సంస్థ షైర్‌ 2 శాతం పుంజుకుంది.

Image result for nse plunges

మెటల్‌, ఫార్మా, ఆటో పతనం
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, ఫార్మా, ఆటో 3.5-2.25 శాతం మధ్య నీరసించాయి. వడ్డీ రేట్ల ప్రభావిత రియల్టీ, బ్యాంక్‌ నిఫ్టీ సైతం 0.7 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్‌ ఫార్మా, హిందాల్కో, వేదాంతా, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌, ఎంఅండ్‌ఎం, ఐబీ హౌసింగ్‌, సిప్లా, కోల్‌ ఇండియా 7-3 శాతం మధ్య పతనమయ్యాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్‌ప్రాటెల్‌, టెక్‌ మహీంద్రా 2-0.6 శాతం మధ్య బలపడ్డాయి.

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో భారత్ ఫోర్జ్‌, దివాన్‌ హౌసింగ్‌, ఇన్ఫీబీమ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ కేపిటల్‌, ఐడీఎఫ్‌సీ, భెల్, ఎస్కార్ట్స్‌ ఆర్‌కామ్‌ 8.5-5.5 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. మరోపక్క అరవింద్‌ 3.5 శాతం జంప్‌చేసింది. ఈ బాటలో స్టార్‌, ఐడీబీఐ, డీఎల్‌ఎఫ్‌, మహానగర్‌ గ్యాస్‌, కేడిలా, డాబర్‌ 1.7-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి. 

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.5 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1793 నష్టపోగా.. 699 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. Most Popular