యథాతథ పాలసీకే ఎంపీసీ ఓటు

యథాతథ పాలసీకే ఎంపీసీ ఓటు

రిజర్వ్ బ్యాంక్‌ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) పరపతి నిర్ణయాలను ప్రకటించింది. యథాతథ విధానాల కొనసాగింపునకే కట్టుబడుతున్నట్లు తెలియజేసింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 6.5 శాతం వద్దే కొనసాగనుంది. రివర్స్‌ రెపో రేటు 6.25 శాతంగా అమలుకానుంది. చట్టబద్ధ ద్ర్యవ్య నిష్పత్తి(స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో-ఎస్‌ఎల్‌ఆర్‌)లో 2019 జనవరి నుంచీ ప్రతి మూడు నెలలకు ఒకసారి 0.25 శాతం చొప్పున కోతను అమలు చేయనున్నట్లు తెలియజేసింది.

Image result for rbi

ఇతర వివరాలు ఇలా..
చమురు ధరలు దిగిరావడం, రూపాయి బలపడటం, క్యూ2లో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7.1 శాతానికే పరిమితంకావడం వంటి అంశాల నేపథ్యంలో ఎంపీసీ రెండు రోజులపాటు పరపతి సమీక్షా సమావేశాలను నిర్వహించింది. అక్టోబర్‌ 11న డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టం 74.50ను తాకిన సంగతి తెలిసిందే. అధిక చమురు ధరలు, రూపాయి పతనం నేపథ్యంలో ఇంతక్రితం అక్టోబర్‌లో చేపట్టిన పాలసీ సమీక్షలోనూ ఎంపీసీ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడిన విషయం విదితమే. కాగా.. ఈ ఏడాది ద్వితీయార్థం(అక్టోబర్‌-మార్చి)లో రిటైల్‌ ధర ద్రవ్యోల్బణం 2.7-3.2 శాతంగా అంచనా వేసింది. ఇదే కాలంలో దేశ ఆర్థిక పురోగతి 7.2-7.3 శాతం స్థాయిలో వృద్ధి చూపగలదని అంచనా వేసింది.Most Popular