ఆర్‌బీఐవైపు చూపు- నష్టాల బాటలోనే

ఆర్‌బీఐవైపు చూపు- నష్టాల బాటలోనే

ఆర్‌బీఐ పరపతి సమీక్షపై కన్నేసిన ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులకే పరిమితమయ్యాయి. దీనికితోడు ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించనుందన్న అంచనాలు, అమెరికా-చైనా వాణిజ్య మైత్రిపై సందేహాలు వంటి ప్రతికూలతలు ఇన్వెస్టర్లలో గుబులు రేపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతోనే కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 233 పాయింట్లు పతనమై 35,901ను తాకింది. ఫలితంగా మళ్లీ 36,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. నిఫ్టీ 79 పాయింట్ల నష్టంతో 10,790 వద్ద ట్రేడవుతోంది. 

ఐటీ మాత్రమే 
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ వెనకడుగు వేశాయి. ప్రధానంగా మెటల్‌ 3 శాతం పతనంకాగా.. ఆటో, ఫార్మా, మీడియా 1.7 శాతం స్థాయిలో  వెనకడుగు వేశాయి. ఐటీ మాత్రమే నష్టపోకుండా నిలదొక్కుకుంది. మెటల్‌ స్టాక్స్‌లో జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, ఎన్‌ఎండీసీ, వేదాంతా, నాల్కో, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, హింద్‌ కాపర్‌ 5-1 శాతం మధ్య పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, సన్‌ ఫార్మా, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌ 3.2-2.4 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ 1.3-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి.

Image result for steel making
 
ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో భారత్ ఫోర్జ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ఇన్ఫీబీమ్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, దివాన్‌ హౌసింగ్‌, భెల్‌, ఆర్‌కామ్‌, పీఎఫ్‌సీ 8-4.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క అరవింద్‌ 5 శాతం జంప్‌చేసింది. ఈ బాటలో డీఎల్‌ఎఫ్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, కేడిలా, బాష్‌, ఐడీబీఐ, గ్లెన్‌మార్క్‌ 2-1.3 శాతం మధ్య ఎగశాయి. 

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1680 నష్టపోగా.. 732 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. Most Popular