అరవింద్‌ జూమ్‌- కేడిలా అప్‌

అరవింద్‌ జూమ్‌- కేడిలా అప్‌

విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం కొనుగోలుకి సిఫారసు చేయడంతో దేశీ టెక్స్‌టైల్స్‌ దిగ్గజం అరవింద్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తోంది. మరోవైపు విదేశీ రీసెర్చ్‌ దిగ్గజం రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో దేశీ ఫార్మా సంస్థ కేడిలా హెల్త్‌కేర్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు ఇలా...

అరవింద్‌ లిమిటెడ్‌
విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ యూబీఎస్‌ కొనుగోలు రేటింగును కొనసాగిస్తున్నట్లు పేర్కొనడంతో అరవింద్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5.4 శాతం జంప్‌చేసింది. రూ. 106 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 100 దగ్గర ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఏడాది కాలంలో అరవింద్‌ షేరు 30 శాతం రిటర్న్‌ ఇవ్వగలదని భావిస్తూ యూబీఎస్‌ రూ. 130 టార్గెట్‌ ధరను ప్రకటించింది. ఇటీవల కంపెనీ డీమెర్జర్‌ చేపట్టిన కారణంగా టెక్స్‌టైల్స్‌ బిజినెస్‌తోపాటు.. అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ విభాగం మెరుగైన పనితీరును చూపే వీలున్నట్లు అభిప్రాయపడింది.

Image result for cadila healthcare

కేడిలా హెల్త్‌కేర్‌
రిస్క్‌ రివార్డ్‌ అనుకూలంగా ఉన్న కారణంగా కేడిలా హెల్త్‌కేర్‌ షేరు కొనుగోలుకి సిఫారసు చేస్తున్నట్లు గ్లోబల్‌ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తాజాగా పేర్కొంది. దీంతో కేడిలా హెల్త్‌కేర్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 1.7 శాతం పెరిగి రూ. 359 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 363ను అధిగమించింది. దేశీయంగా వేక్సిన్లు, బయోసిమిలర్స్‌ మానిటైజేషన్‌ కంపెనీకి లబ్ది చేకూర్చగలదని సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. కాంప్లెక్స్‌ ప్రొడక్టులకు అనుమతులు పొందడంలో కంపెనీ పటిష్ట పనితీరును చూపుతున్నట్లు పేర్కొంది. దీంతో గతంలో ఇచ్చిన రూ. 410 టార్గెట్‌ ధరను రూ. 430కు పెంచింది. Most Popular