నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ బ్రేకవుట్.. ! ర్యాలీకి ఈ 4 స్టాక్స్ రెడీ

నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ బ్రేకవుట్.. ! ర్యాలీకి ఈ 4 స్టాక్స్ రెడీ

నిఫ్టీ గతవారం కీలకమైన నిరోధ స్థాయిని బ్రేక్ చేసి పాజిటివ్ బయాస్‌తో పైపైకి దూసుకుపోతోంది. ప్రస్తుతం ఇండెక్స్‌కు సపోర్ట్ స్థాయి 10500 పాయింట్ల నుంచి 10700 స్థాయికి వెళ్లింది. 

ఈ నెలలో ఫెడ్ మీటింగ్, ఓపెక్ మీటింగ్ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, బ్రెగ్జిట్‌పై యూకె పార్లమెంట్ ఓటింగ్ సహా అనేక ముఖ్యమైన ఈవెంట్స్ ఉన్నాయి. అందుకని రాబోయే కొద్ది రోజుల పాటు మార్కెట్లలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఒక వేళ ఇండెక్స్ 10700 పాయింట్ల దిగువకు పడిపోతే బయింగ్‌కు అవకాశాలు వస్తాయని నిపుణులు చెబ్తున్నారు. ఈ సిరీస్‌లో నిఫ్టీ 11,100 పాయింట్ల వరకూ వెళ్లేందుకు ఆస్కారం ఉందని టెక్నికల్ ఎనలిస్టులు అంచనా కడ్తున్నారు.

బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశాలున్నాయని, అయితే ఇక్కడి నుంచి ఫార్మా రంగం ఔట్‌పర్ఫార్మ్ చేసే అవకాశం ఉందనేది నిపుణుల మాట. ఫార్మాలో సిప్లా, అరబిందో, డాక్టర్ రెడ్డీస్.. ఇన్వెస్ట్‌మెంట్‌కు బెస్ట్ పిక్స్‌గా ఉంటాయి. 

ఒక వేళ ఎన్‌బిఎఫ్‌సి సెగ్మెంట్లో ఉండాలని అనుకుంటే ఎల్ అండ్ టి ఫైనాన్షియల్ హోల్డింగ్స్, బజాజ్ ఫైనాన్స్ ఎట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. 

ఇదే సమయంలో నిఫ్టీతో పోలిస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఔట్‌పర్ఫార్మ్ చేసే అకాశాలున్నాయి. 6150 - 6350 మధ్య కన్సాలిడేషన్‌లో ఉన్న ఈ ఇండెక్స్‌లో బ్రేకవుట్ వచ్చే అవకాశాలున్నాయి. 6350 స్థాయిని స్మాల్ క్యాప్ ఇండెక్స్ బ్రేక్ చేస్తే.. 6700-7000 స్థాయి వరకూ వెళ్లొచ్చు. అందుకే ఈ సమయంలో స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో ఉన్న ఈ స్టాక్స్ ట్రేడింగ్‌కు, ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలంగా ఉన్నాయి. 

షార్ట్ టర్మ్‌లో 7-14 శాతం రాబడి ఇచ్చే సత్తా ఉన్న స్టాక్స్ వివరాలివి. 

ఎన్ ఐ ఐ టి టెక్నాలజీస్ NIIT Technologies: CMP Rs 1,120| Rating: Buy | Target: Rs 1,215 | Stoploss: Rs 1,080 | Return: 8.2%

ఎండ్యురెన్స్ టెక్నాలజీస్ | Endurance Technologies: CMP Rs 1,120| Rating: Buy | Target: Rs 1,260 | Stoploss: Rs 1,060 | Return: 12.5%

రిలయన్స్ క్యాపిటల్ | Reliance Capital: CMP Rs 232| Rating: Buy | Target: Rs 260 | Stoploss: Rs 215 | Return: 12%

పేజ్ ఇండస్ట్రీస్ | Page Industries: CMP Rs 25,840| Rating: Buy | Target: Rs 28,500 | Stoploss: Rs 24,700 | Return: 14%

పిడిలైట్ ఇండస్ట్రీస్ | Pidilite Industries: CMP Rs 1,162| Rating: Sell | Target: Rs 1,085 | Stoploss: Rs 1,200 | Return: 6.8%

Analyst - Arpan Shah, Monarch Networth Capital

ఇవి ప్రాఫిట్ యువర్ ట్రేడ్ రికమెండేషన్స్ కాదు. గమనించగలరు. కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చినవి. 
 Most Popular