నేలచూపులతో- మెటల్స్‌ మెల్టింగ్‌!

నేలచూపులతో- మెటల్స్‌ మెల్టింగ్‌!

ఆర్‌బీఐ పరపతి సమీక్ష, విదేశీ ప్రతికూలతల నేపథ్యంలో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 222 పాయింట్లు పతనమై 35,912ను తాకింది. ఫలితంగా మళ్లీ 36,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. నిఫ్టీ 79 పాయింట్ల నష్టంతో 10,790 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించనుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో తాజాగా ఆందోళనలకు దారితీశాయి. దీంతో అమెరికా నుంచి ఆసియా వరకూ స్టాక్‌ మార్కెట్లు దెబ్బతింటున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు 3 శాతంపైగా పతనంకాగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు 1.5-0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఆర్‌బీఐ రెండు రోజుల పాలసీ సమావేశాలు నేడు ముగియనుండగా.. మధ్యాహ్నం నిర్ణయాలు వెలువడనున్నాయి. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. 

ఐటీ మాత్రమే 
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ వెనకడుగు వేశాయి. ప్రధానంగా మెటల్‌ 3.2 శాతం పతనంకాగా.. ఆటో, ఫార్మా, రియల్టీ 1.7-1 శాతం మధ్య నష్టపోయాయి. ఐటీ మాత్రమే నష్టపోకుండా నిలదొక్కుకుంది. మెటల్‌ స్టాక్స్‌లో జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌, హిందాల్కో, ఎన్‌ఎండీసీ, వేదాంతా, టాటా స్టీల్‌, నాల్కో, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, హింద్‌ కాపర్‌, హింద్‌ జింక్‌ 6-1.5 శాతం మధ్య పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో గ్రాసిమ్‌, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3-2 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌ 1.2-0.35 శాతం మధ్య పుంజుకున్నాయి.

Image result for sensex down
 
ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో భారత్ ఫోర్జ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ఇన్ఫీబీమ్‌, ఆర్‌కామ్‌, పీఎఫ్‌సీ, మదర్‌సన్, దివాన్‌ హౌసింగ్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఇంజినీర్స్‌ ఇండియా 8.3-4.35 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క అరవింద్‌ 5 శాతం జంప్‌చేసింది. ఈ బాటలో కేడిలా, బాష్‌, ఐడీబీఐ, అపోలో హాస్పిటల్స్‌, మహానగర్‌ గ్యాస్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ 1.6-0.8 శాతం మధ్య ఎగశాయి. 

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1536 నష్టపోగా.. 632 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. 



Most Popular