ప్రకాష్‌- కేశోరామ్‌.. పతన బాట!

ప్రకాష్‌- కేశోరామ్‌.. పతన బాట!

ఓవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) ఆస్తులను ఎటాచ్‌ చేసినట్లు  వెలువడ్డ వార్తలు ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లో భారీ అమ్మకాలకు దారిచూపాయి. మరోపక్క గత కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లో ట్రేడర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలకు దిగడంతో కళతప్పింది. వివరాలు చూద్దాం..

ప్రకాష్‌ ఇండస్ట్రీస్  
బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈడీ రూ. 117 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్‌చేసినట్లు వెలువడ్డ వార్తలు ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ను బలహీనపరిచాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం కుప్పకూలింది. రూ. 83 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం దాదాపు 6 శాతం పతనమై రూ. 87.50 వద్ద ట్రేడవుతోంది.

Image result for Kesoram Industries

కేశోరామ్‌ ఇండస్ట్రీస్  
ఎట్టకేలకు టైర్ల తయారీ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనున్నట్లు వెల్లడించడంతో కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లో ర్యాలీకి బ్రేక్‌పడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 6.4 శాతం పతనమై రూ. 91 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 96 వద్ద గరిష్టాన్నీ, రూ. 90 దిగువన కనిష్టాన్నీ తాకింది. బిర్లా టైర్స్‌ లిమిటెడ్‌ను ప్రత్యేక కంపెనీగా విడతీసేందుకు బోర్డు అనుమతించినట్లు కేశోరామ్‌ పేర్కొంది. 7.5 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగిన సిమెంట్‌ బిజినెస్‌ కేశోరామ్‌ చేతిలోనే ఉంటుందని తెలియజేసింది. కాగా.. నవంబర్‌ 13 నుంచీ ఈ షేరు 65 శాతం లాభపడటం విశేషం!Most Popular