క్రిధాన్‌ ఇన్‌ఫ్రా అప్‌- టామో డీలా

క్రిధాన్‌ ఇన్‌ఫ్రా అప్‌- టామో డీలా

సహచర కంపెనీ కాంట్రాక్టును పొందిన వార్తలతో క్రిధాన్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతోంది. మరోపక్క రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన వార్తలతో ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ కౌంటర్లో అమ్మకాలు నమోదవుతున్నాయి. వివరాలు చూద్దాం...

క్రిధాన్‌ ఇన్‌ఫ్రా
అసోసియేట్‌ కంపెనీ విజయ్‌ నిర్మాణ్‌ మహారాష్ట్రలో రహదారి నిర్మాణానికి కాంట్రాక్టు పొందినట్లు క్రిధాన్‌ ఇన్ఫ్రా లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసింది. రూ. 49.50 వద్ద ట్రేడవుతోంది. కాంట్రాక్టు విలువ రూ. 105 కోట్లుకాగా.. ముంబై- నాగ్‌పూర్‌ మధ్య సూపర్‌ కమ్యూనికేషన్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు అవసరమైన మేజర్, మైనర్‌ బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉంటుందని క్రిధాన్‌ ఇన్‌ఫ్రా తెలియజేసింది. ఏడాదిలోగా కాంట్రాక్టును పూర్తిచేయవలసి ఉంటుందని తెలియజేసింది. కంపెనీలో ప్రమోటర్లకు 47.04 శాతం వాటా ఉంది. 

Related image

టాటా మోటార్స్‌
కంపెనీ క్రెడిట్‌ రేటింగ్‌ను విదేశీ దిగ్గజం ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ డౌన్‌గ్రేడ్‌ చేసిన వార్తలతో ఆటో బ్లూచిప్‌ టాటా మోటార్స్‌ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు రూ. 170 వరకూ క్షీణించింది. ప్రస్తుతం 2 శాతం నష్టంతో రూ. 172 వద్ద ట్రేడవుతోంది. టాటా మోటార్స్‌ ఇష్యూ క్రెడిట్‌, సీనియర్‌ సెక్యూర్డ్‌ నోట్ల రేటింగ్‌ను ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ BB నుంచి తాజాగా BB- నెగిటివ్‌ వాచ్‌కు సవరించింది. లగ్జరీ కార్ల బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ లాభదాయకత క్షీణిస్తున్న నేపథ్యంలో రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ పేర్కొంది. కాగా.. ఇటీవల మూడీస్‌ సైతం టాటా మోటార్స్‌ రేటింగ్‌ను Ba2 నుంచి Ba3కు సవరించిన సంగతి తెలిసిందే.Most Popular