ప్రపంచ మార్కెట్ల దెబ్బ- నష్టాలతో!

ప్రపంచ మార్కెట్ల దెబ్బ- నష్టాలతో!

ప్రపంచ ఆర్థిక పురోగతిపై తాజాగా చెలరేగిన ఆందోళనలు అమెరికాసహా ఆసియా వరకూ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో మంగళవారం అమెరికా మార్కెట్లు 3 శాతంపైగా పతనమయ్యాయి. ఈ బాటలో ఆసియా మార్కెట్లు సైతం 1.5-0.5 శాతం మధ్య క్షీణించగా దేశీయంగానూ నష్టాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 262 పాయింట్లు క్షీణించి 35,872ను తాకింది. ఫలితంగా మళ్లీ 36,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. నిఫ్టీ 79 పాయింట్ల నష్టంతో 10,790 వద్ద ట్రేడవుతోంది. 

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ వెనకడుగు వేశాయి. ప్రధానంగా మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్‌ నిఫ్టీ 1.3-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌, టాటా మోటార్స్‌, హిందాల్కో, యూపీఎల్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గ్రాసిమ్‌, జీ, టైటన్‌ 2.4-1.2 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్‌ 1.6-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి.
 Image result for BSE
ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో భారత్ ఫోర్జ్‌, అదానీ పవర్‌, ఇన్ఫీబీమ్‌, మదర్‌సన్, రెప్కో హోమ్‌, జిందాల్‌ స్టీల్‌ 5-2.25 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క అరవింద్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఆర్‌కామ్‌, అపోలో హాస్పిటల్స్‌, చెన్నై పెట్రో, కేడిలా, ఆర్‌ఈసీ, కేన్‌ఫిన్‌ హోమ్‌, ఆర్‌పవర్‌ 2.3-1.2 శాతం మధ్య ఎగశాయి. 

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.6 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 885 నష్టపోగా..448 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. Most Popular